ఆహారంలో రెండు పూటలా ఉల్లిగడ్డ, మజ్జిగ చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
తినడానికి గంట ముందు ఓ గ్లాస్ వేడినీళ్లు తాగితే రక్తం శుద్ధి అవుతుంది.
ధనియాల కషాయం రెండు పూటలా తాగితే మూత్ర సమస్యలు రావు.
నిత్యం ఆహారంలో వెల్లుల్లి చేర్చుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి.
రోజూ తీసుకునే భోజనంలో కూరగాయలు, ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలి.
రోజూ భోజనం చేసేటప్పుడు ముద్దలో పావు చెంచా
వాము పొడి
పెట్టుకుని తింటే కడుపు ఉబ్బరం రాదు.
ఆహారంలో ఉప్పు, చక్కెర మోతాదు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
మారుతున్న జీవన విధానంలో మాసాలలు ఎక్కువగా వాడుతున్నారు. వాటి మోతాదు తగ్గించుకుంటే మంచిది.
ఉదయం ఇడ్లీ, దోశల్లోకి బియ్యం కాకుండా.. చిరుధాన్యాలు
(Millets)
వాడటం మంచిది.
ఉడకబెట్టిన శనగలు, వేరుశనగలు, అలసందలు అల్పాహారంగా తీసుకోవడం మంచిది.
పాలిష్ బియ్యం స్థానంలో
ముడి బియ్యం
లేదా తక్కువ పాలిష్ వేసిన బియ్యం తినడం మంచిది.
టిఫిన్, భోజనం ఏదైనా వండేందుకు తక్కువ మోతాదులో
నూనె
వాడటం మంచిది.
రాత్రిపూట వైట్ రైస్‌కి బదులుగా
చపాతీలు, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు
తినడం మంచిది.
రాత్రి భోజనాన్ని 8 గంటలలోపే పూర్తి చేసుకోవాలి. అలా అయితే తిన్నది చక్కగా జీర్ణం అవుతుంది.
రాత్రి భోజనం చేయగానే పడుకోవడం ఆరోగ్యానికి హానికరం. కాస్త అటూ ఇటూ తిరగడం మంచిది.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి