భారతదేశం ఎన్నో రకాల ఖనిజ సంపదలకు నిలయం.
భూగర్భంలోనే కాకుండా ఉపరితలంపై కూడా అప్పుడుప్పుడు బంగారు నాణేలు, వజ్రాలు లభిస్తున్నాయి.
దేశంలోని ప్రాంతాల్లో బంగారు నాణేలు, వెండినాణేలు దొరికిన ఘటనలు చాలానే జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో కూడా బంగారు నాణేలు తరచూ దొరుకుతుంటాయి.
వర్షాకాలం సమయంలో రాయలసీమ ప్రాంత ప్రజలు పొలాల్లోకి వెళ్లి వజ్రాల వేట సాగించే వారు.
తాజాగా పశ్చిమ బెంగాల్ లోని భీర్భూమ్ ప్రాంతం వారు కూడా నది ఒడ్డుకు భారీగా క్యూ కడుతున్నారు.
అక్కడ బంగారం ఉన్నట్లు తెలియడంతో గ్రామస్థులు జల్లెడపడుతున్నారు.
వారం క్రితం బీర్భూమ్ ప్రాంతంలోని బన్ స్లోయ్ నది ఒడ్డుకు స్నానంకి వెళ్లిన వారికి బంగారం దొరికింది.
ఆ విషయం గ్రామస్తులకు తెలియడంతో వారు కూడా బంగారం కోసం నది వద్దకు వెళ్తున్నారు.
వారం క్రితం నది ఒడ్డున మట్టిని తవ్వుతుండగా బంగారం దొరికింది.
నది ఒడ్డున దొరికిన బంగారం గురించి గ్రామస్తులు పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
నది ఒడ్డున దొరికిన బంగారు నాణే చాలా చిన్నగా , పాతపైసాలాగా ఉందంట.
అంతే కాక ఆ బంగారు నాణేంపై కొన్ని పురాతన అక్షరాలు, గుర్తులు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు.
నది ఒడ్డున దొరికిన బంగారు నాణేలు చక్రాల రూపంలో ఉన్నాయని స్థానికులు అంటున్నారు.
తమకు ఏమైన బంగారం దొరుకుతుందేమోననే నమ్మకంతో గ్రామస్తులు నది ఒడ్డుకు పొటెత్తున్నారు.