మన జాతీయ గీతం జన గణ మన. నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ దీన్ని రచించారు.
1911 డిసెంబరు 27 న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటి సారిగా ఆలపించారు.
1912 జనవరిలో ఈ గీతాన్ని "తత్వ భోదిని" అనే పత్రిక "భారత విధాత" అనే పేరుతో ప్రచురించింది.
1950 జనవరి 24న దీన్ని జాతీయ గీతంగా రాజ్యాంగం ఆమోద ముద్ర వేసింది.
1950 జనవరి 24న దీన్ని జాతీయ గీతంగా రాజ్యాంగం ఆమోద ముద్ర వేసింది.
అప్పటి నుండి ఈ గీతాన్ని భక్తి, శ్రద్ధలతో, అత్యంత గౌరవంతో గీతాలాపన చేస్తాం.
చిన్నప్పటి నుండే ఈ గీతాన్ని మనలో భాగస్వామ్యం చేశారు పెద్దలు. పాఠశాలల్లో దీన్ని అందరూ ఆలపించిన వారే.
ఈ గీతం విన్నా, ఆలపించినా రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఈ గీతాన్ని అవమానించినా, అపహాస్యం చేసినా చట్ట విరుద్ధం.
అయితే కొంత మంది మూర్ఖులు జాతీయ గీతాన్ని అవహేళన చేస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఈ గీతాన్ని అగౌరపరిచిన ఘటన కలకలం సృష్టించింది.
అందులోనూ దీని రచయిత రవీంద్రనాథ్ పుట్టిన పశ్చిమ బెంగాల్‌లో ఈ ఘటన జరగడం విచారకరం.
వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు చేతిలో సిగరెట్ పట్టుకొని, జాతీయ గీతాన్ని ఆలపించారు.
అంతేకాదు అందులోని సాహిత్యాన్ని తప్పుగా ఉచ్ఛరిస్తూ, సిగరెట్ చూపిస్తూ గీతాన్ని అపహాస్యం చేశారు.
అంతేకాకుండా ఆ సిగరెట్‌ను జాతీయ జెండాతో పోల్చడం గమనార్హం. వీడియో చివరిలో అందులో యువతి క్షమాపణలు కూడా చెప్పింది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు తిట్టిపోశారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేశారు.
ఆ వీడియోను ఫేస్ బుక్ నుండి తొలగించిన అమ్మాయిలు.. ఫన్ కోసం ఈ వీడియోను చేసినట్లు చెప్పుకొచ్చారు.
అయితే అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. వీరిపై బరఖ్‌పూర్ సైబర్ సెల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.