టాలీవుడ్ లో సరైన హిట్టు కోసం స్ట్రగుల్ అవుతున్న హీరోలలో మంచు విష్ణు ఒకరు

మంచు విష్ణునే స్వయంగా నిర్మించి, నటించిన యాక్షన్ కామెడీ చిత్రం 'జిన్నా' తాజాగా విడుదలైంది

మరి జిన్నా మూవీతో మంచు విష్ణు హిట్టు కొట్టాడా లేదా? రివ్యూలో చూద్దాం!

కథ:  గాలి నాగేశ్వరరావు అలియాస్ జిన్నా(మంచు విష్ణు) టెంట్ హౌస్ నడుపుతుంటాడు. జిన్నా ఏ పెళ్లికి టెంట్ వేసినా ఆ పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి.

చిన్నప్పటి నుండే కలిసి పెరిగిన జిన్నా, పచ్చళ్ళ స్వాతి(పాయల్) ప్రేమించుకుంటారు. కానీ.. జిన్నాకు ఊరి నిండా అప్పులతో అనుకోని సమస్యలో ఇరుక్కుంటాడు.

ఎలాగైనా ఊరికి ప్రెసిడెంట్ అయ్యి అప్పులు తీర్చాలని భావిస్తాడు. అదే టైంలో.. జిన్నాను ప్రేమిస్తున్నానంటూ అమెరికా నుండి రేణుక(సన్నీ లియోన్) ఊర్లోకి అడుగుపెడుతుంది

మరి రేణుక ఎంట్రీతో జిన్నా లైఫ్ ఎలాంటి మలుపు తిరిగింది? చివరికి జిన్నా ఎవరిని పెళ్లాడాడు? అనేది మిగిలిన కథ.

గతంలో ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి యాక్షన్ కామెడీ సినిమాల తర్వాత మళ్లీ ఆ జానర్ లో ఈ మూవీ చేశాడు విష్ణు

పాత కథకు కొత్త ట్రీట్మెంట్ ఇచ్చి తెరకెక్కించారు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన హీరోహీరోయిన్స్ ప్రేమించుకోవడం అనే కాన్సెప్ట్ ఎన్నో సినిమాలలో చూశాం.

ఈ జిన్నా మూవీ కూడా అలాంటి రొటీన్ లైన్ తో వచ్చింది. ఓపెనింగ్ బాగుంది. చిన్నతనంలో జిన్నా, స్వాతి, రేణుకల ఫ్రెండ్ షిప్ ని సాంగ్ తో బాగా చూపించారు.

కట్ చేస్తే.. స్కూల్ టైంలో ఊరొదిలి వెళ్లిన హీరోయిన్.. తిరిగి వచ్చేసరికి హీరో బేవర్స్ గా ఉండటం మామూలే ఇదివరకే చూశాం.

జిన్నా టెంట్ హౌస్ నడుపుతూ అప్పుల పాలవ్వడం, తనతో పాటు పెరిగిన పచ్చళ్ళ స్వాతి(పాయల్)ని లవ్ చేయడం.. మధ్యమధ్యలో కామెడీతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది

ఇంటర్వెల్ టైమ్ కి రేణుక(సన్నీ లియోన్) క్యారెక్టర్ తో బిగ్ ట్విస్టు ప్లాన్ చేశారు. ఈ మూవీని దాదాపు కామెడీపై ఆధారపడి తీశారు.

క్లైమాక్స్ కి వచ్చేసరికి పాత సినిమాల్లోలాగే హీరో కోసం ఇద్దరు హీరోయిన్స్ పోటీ పడటం? అనే పాయింట్ రైస్ చేశారు

జిన్నా కథాకథనాలలో బలం, పట్టు లేకపోవడంతో.. ప్రేక్షకులు తర్వాత ఏం జరగబోతుంది అనేది ముందే అర్థం చేసుకోగలరు

ఈ మూవీలో జిన్నాగా మంచు విష్ణు క్యారెక్టర్, చిత్తూర్ యాస, కామెడీ టైమింగ్ బాగుంది. ముఖ్యంగా ఫైట్స్, డాన్స్ కోసం బాగా కష్టపడ్డాడు.

ప్లస్ లు: మంచు విష్ణు, సన్నీ లియోన్ కామెడీ సాంగ్స్ యాక్షన్ సీక్వెన్స్

మైనస్ లు: రొటీన్ స్టోరీ స్క్రీన్ ప్లే ప్రెడక్టబుల్ సీన్స్

చివరి మాట:  జిన్నా భాయ్.. కామెడీ కోసమే!

రేటింగ్: 2.5/5