తెలుగు నూతన సంవత్సరం చైత్ర మాసంలో శుక్లపక్షం నుంచి ప్రారంభమవుతుంది.

చైత్రమాసంలో శుక్షపక్షం మొదలయ్యే తొలి రోజున  ఉగాది పండగను జరుపుకుంటారు.

ఈసారి కూడా మార్చి 22న చైత్ర శుక్ల పక్షం ప్రారంభమవుతుంది.

ఈ పండగను హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

కొత్త బట్టలు ధరించి, గోమాతలను పూజిస్తూ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.

ఉగాది పండుగ రోజు కొన్ని వస్తువులను తెచ్చుకుంటే ఇంట్లో డబ్బులకు కొరత ఉండదని కొందరి నమ్మకం.

ఉగాది రోజు ఇంటికి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేసి తీసుకురావాలో తెలుసుకుందాం.

చిన్న కొబ్బరికాయను తెచ్చి ఎర్రటి గుడ్డలో చుట్టి  బీరువాలో  ఉంచితే మంచిదంట.

నూతన సంవత్సరం రోజున  తులసి మొక్కను ఇంటికి తెచ్చుకోవడం మంచి.

తులసీ మొక్కకు పూజలు చేయడం వల్ల అంతా ధనం లభిస్తుందంట.

ఉగాది  రోజున లోహపు తాబేలు ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల సానుకూల శక్తి ప్రసారమవుతుంది.

ఉగాది రోజున ముత్యాల శంఖం  ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ ధనం ఉంటుంది.

అలానే నెమలి ఈక ఇంట్లో ఉంటే.. అక్కడ  లక్ష్మీదేవి ఉంటుంది.

లాఫింగ్ బుద్దని ఉగాది రోజు తెచ్చుకోవడం వలన డబ్బులకు లోటు ఉండదు.

ఇక్కడ ఇచ్చిన విషయాలు కేవలం నమ్మకంపై ఆధారపడి ఉంటాయి.

వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.. మనుషుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని అందించాం.