టీనేజ్ లో ఉన్న అమ్మాయిలకు, అబ్బాయిలకు ముఖంపై మొటిమలు రావడం సర్వసాధారణం.
కానీ, వయసు పెరిగినా కూడా అదే మాదిరిగా మొటిమలు వస్తే మాత్రం శరీరంలో వేడి, ఇతరత్ర కారణాల వల్ల ముఖంపై మొటిమలు వస్తుంటాయి.
ఆ మొటిమలను గిల్లిన తర్వాత అక్కడ నల్లని మచ్చలుగా మారిపోతుంటాయి, దీంతో ముఖం అంద వికారకంగా కనిపిస్తుంటాయి.
ముఖంపై కనిపించే ఇలాంటి మచ్చలు, మొటిమలను ఈ సింపుల్ చిట్కాతో వారం రోజుల్లో మాయం చేయొచ్చట.
అసలు ఈ సింపుల్ చిట్కా ఏంటి? ఎలా తయారు చేసుకుని వాడాలనే పూర్తి వివరాలు మీ కోసం.
గుమ్మటి కాయ గింజలను తీసుకుని వాటిని గ్రైండ్ లో వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
అందులో కొద్దిగా తేనే, యాపిల్ వెనిగర్ వేసి కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ లో వేసుకుని మరోసారి పేస్ట్ లా చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని మచ్చలు ఉన్న చోట అప్లయ్ చేసుకోవాలి.
అది 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి.
ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తొలగిపోయే అవకాశం ఉంటుంది.
ఈ సింపుల్ చిట్కాను మీరు ఓ సారి ట్రై చేయండి.