5 లక్షలకే సొంతిల్లా? అసాధ్యం అని అనుకుంటున్నారా.. అయితే మీ కోసమే ఈ స్టోరీ.

మీరు ఏ సిటీకి వెళ్లినా.. ఏ పల్లెటూరికి వెళ్లినా ల్యాండ్ కాస్ట్ ఎంతైనా గానీ ఇల్లు మాత్రం 5 లక్షల లోపే ఉంటుంది.

సిమెంట్, ఐరన్, కూలీల రేట్లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇల్లు కట్టాలంటే కనీసం రూ. 20 లక్షలు అవుతుంది.

అలాంటిది 5 లక్షల్లో ఇల్లు ఎలా అవుతుందన్న ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది.

అయితే ఈ ఇంటిని కంటైనర్ హోమ్ అని అంటారు.

ఇది పోర్టబుల్ హోమ్. ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.

స్టీల్, మైల్డ్ స్టీల్, జీఐ మెటీరియల్స్ తో ఈ కంటైనర్ హోమ్స్ ని తయారు చేస్తారు. 25 ఏళ్ళు మన్నిక ఉంటుంది.  

పర్యావరణ అనుకూలంగా ఉండడమే గాక ఫైర్ ప్రూఫ్, ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్ తో వస్తాయి.

ఫ్లోరింగ్ కి కానీ, పైప్ లైన్ గానీ, కరెంట్ వైరింగ్ కి గానీ ప్రత్యేకించి పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు.

బాత్రూం, కిచెన్, హాల్, బెడ్ రూమ్ అన్నీ ఈ కంటైనర్ హోమ్ లోనే వస్తాయి.

స్థలం ఉండి.. కంటైనర్ హోమ్ ని తెచ్చుకుంటే 20 లక్షలు ఆదా చేసుకున్నట్టే.

ఎందుకంటే ఇల్లు కట్టడానికి రూ. 25 లక్షల దాకా అవుతుంది కదా.

ఈ కంటైనర్ హోమ్ చదరపు అడుగుకి రూ. 800 నుంచి రూ. 1000 వరకూ ఉంటుంది.

ఒక చిన్న కుటుంబానికి కనీసం 400 నుంచి 500 చదరపు అడుగుల స్థలం ఉంటే సరిపోద్ది.

అప్పుడు మీ కంటైనర్ హోమ్ కి అయ్యే ఖర్చు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ అవుతుంది.

1000 చదరపు అడుగుల్లో కావాలనుకుంటే రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షలు అవుతుంది.

ఇందులో ఫ్యాబ్రికేటెడ్ ఉడెన్ హౌజ్ లు కూడా ఉన్నాయి. చదరపు అడుగు రూ. 1500 ఖర్చవుతుంది.