నిత్య జీవితంలో అప్పుడప్పుడు అద్భతమైన, అరుదైన దృశ్యాలు మనకు కనిపిస్తుంటాయి.
అలాంటి అద్భుతమైన దృశ్యాలు చూసినప్పుడు ఒళ్లు పులకరించి పోతుంది.
విజయనగరం జిల్లాలో మహాశివరాత్రి పండగ సమయంలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది.
విజయనగరం జిల్లాలోని కోనాడ గ్రామంలో త్రిలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు ఘనంగా జరిగాయి.
మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయాన్ని అంగరంగ వైభవంగా అలకరించారు.
పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి త్రిలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
శివరాత్రి మరుసటి రోజైన ఆదివారం త్రిలింగేశ్వర స్వామి ఆలయంలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది.
స్వామి వారి ఆలయ సన్నిధిలో ఉన్న నందీశ్వరడు వద్ద భక్తులు పెట్టిన అరటి పండ్లను ఓ ఆవు తినేసింది.
అంతేకాక ఆ నంది విగ్రహాన్ని కూడా ప్రాణం ఉన్ననట్లు ఆ ఆవు భావించినట్లు ఉంది.
తాను తినడంతో పాటు నందీశ్వరుడిని అరటిపండు తినమనట్లు నోటికి చేర్చింది.
ఆ అరటిపండును అందుకుని నందీశ్వరుడికి తినిపిస్తున్నట్లు ప్రయత్నించింది.
ఆవు చేసిన సందడి ఆలయానికి వచ్చిన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రతి ప్రాణిలో దేవుడు ఉంటాడు అనేందుకు ఈ దృశ్యం నిదర్శనమని కొందరు అభిప్రాయం పడుతున్నారు.
మహాశివరాత్రి పర్వదినం వేళ ఇలాంటి దృశ్యం కనిపించడంతో భక్తులు పులకించే పోతున్నారు.