అదానీ కుమారుడి నిశ్చితార్థం.. కాబోయే కోడలు ఎవరో తెలుసా!
ఆయన చిన్న కుమారుడు జీత్ అదానీకి వివాహం నిశ్చయం అయ్యింది.
మార్చి 12న గుజరాత్, అహ్మదాబాద్‌లో జీత్ నిశ్చితార్థం జరిగింది.
గుజరాత్‌కు చెందిన దివా జైమిన్ షాతో జీత్ అదానీకి పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఎంగేజ్‌మెంట్ జరిగింది.
దివా తండ్రి జైమిన్ షా గుజరాత్‌లో ప్రముఖ వజ్రాల వ్యాపారి.
సీ దినేశ్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ అనే వజ్రాల కంపెనీ ఉంది.
ప్రస్తుతం ఈ కంపెనీ ముంబై, సూరత్ వెలుపల కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
జీత్-దివాల ఎంగేజ్‌మెంట్ వేడుక అత్యంత నిరాడంబరంగా.. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగింది.
పెళ్లి తేదీ ఎప్పడనేది తెలియదు. కానీ ఈ ఏడాది చివరి నాటికి వీరి వివాహం ఉండవచ్చని తెలుస్తోంది.
ఇక జీత్ అదానీ అదానీ గ్రూప్ సంస్థల ఉపాధ్యాక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.
2019లో అదానీ గ్రూప్‌లో సీఎఫ్‌ఓగా చేరాడు జీత్ అదానీ.
ప్రస్తుతం అదానీ ఎయిర్ పోర్ట్ వ్యాపారంతో పాటు, అదానీ డిజిటల్ ల్యాబ్స్, స్ట్రాటజిక్ ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్, గవర్నమెంట్ పాలసీ వంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
కుటుంబ వ్యాపారంలో కీలక పాత్ర పోషించే జీత్‌కు వ్యక్తిగతంగా విమానాలు నడపడం అంటే చాలా ఇష్టం.
ఈ క్రమంలో ప్రపంచ పైలట్ల దినోత్సవం రోజున ఓ ఛార్టర్డ్ ఫ్లైట్ నడుపుతున్న ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ.. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ సీఈఓగా వ్యవహరిస్తున్నాడు.
హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ తన వ్యాపారంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు.
గతంలో ప్రపంచ మిలియనీర్ జాబితాలో 3వ స్థానానికి చేరుకున్నఅదానీ.. హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత 30 వ స్థానికి పడిపోయాడు.