గరికతో ఏఏ వ్యాధులను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
గరికను ముద్దగా చేసి.. నెయ్యితో కలిపి మిశ్రమంగా తయారు చేసి దాన్ని చర్మంపై రాస్తుండాలి.
అలా చేయడం వలన చర్మంపై ఏర్పడే పొక్కుల సమస్య తగ్గుతుంది.
గరికను దంచి ముద్దగా చేసి గాయాలు, పుండ్లు ఉన్న చోట రాసుకుంటే త్వరగా మానుతాయి.
గరికను పసుపుతో కలిపి ముద్దగా నూరి రాసుకుంటే దద్దుర్లు, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి.
గరిక వేళ్ల కషాయాన్ని తక్కువ మోతాదులో రోజూ కొంచెం తీసుకోవడం వలన మూత్రంలో మంట తగ్గుతుంది.
రెండు టీస్పూన్ల గరిక ముద్దను ఒక కప్పు పెరుగుకు కలిపి తీసుకుంటే మహిళల్లో వచ్చే వైట్ డిశ్చార్జి సమస్య తగ్గుతుంది.
మూత్రంలో రక్తం పడుతుంటే గరిక రసం ఒకటి లేదా రెండు టీస్పూన్లు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
గరికను ముద్దగా చేసి రాస్తుంటే అర్శ మొలలు సమస్య తగ్గుతుందంట.
గరికగడ్డి కషాయంతో పుక్కిట పడుతుంటే నోటిపూత తగ్గుతుంది.
గరికతో తయారు చేసిన కషాయాన్ని రోజూ రెండు పూటలా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి.
రెండు లీటర్ల గరిక రసాన్ని ఒక లీటర్ కొబ్బరినూనెలో వేసి నీరంతా ఆవిరయ్యేలా మరిగించాలి
అలా వచ్చిన రసాన్ని నిల్వ చేసుసుకుని తలనూనెగా వాడుకుంటే చుండ్రు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటించే ముందు మీ దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోండి.