హిందువులకు అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి.

వినాయకుడి జన్మదినాన్ని గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారు.

దేవతలందరిలో వినాయకుడే మొదటి పూజలు అందుకుంటాడు. 

పది రోజుల పాటు పూజలు అందుకుని గణపతి 11వ రోజు గంగమ్మ వడిలోకి చేరుతారు.

అయితే వినాయక చవితిని 10రోజులే ఎందుకు చేస్తారో మీకు తెలుసా?

మరాఠా పాలకుడు శివాజీ వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించాడని చరిత్ర చెబుతోంది.

తమ పౌరుల్లో  జాతీయవాద భావాలను రేకెత్తిండానికే ఇలా చేశాడని చరిత్రకారులు చెబుతున్నారు. 

1893 లో లోకమాన్య తిలక్ కూడా గణేష్ చతుర్థి సంప్రదాయన్ని ప్రారంభించారు. 

యువతలో స్వాతంత్ర్య పోరాట భావాలను రేకెత్తించడానికి లోకమాన్య తిలక్ గణపతి ఉత్సవాల గురించి ఆలోచించారు.

హిందూమత ఆచారాలు, ఆరాధనలతో సంబంధం ఉన్నందున బ్రిటీషర్లు దీనిలో జోక్యం చేసుకోలేదు. 

పూణేలో వినాయక చవితి వేడుకలను 1893 లో బహిరంగంగా ప్రారంభించారు. 

స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ప్రజలందరినీ ఏకతతాటిపైకి తీసుకురావడం ఈ పండగ ఉద్దేశ్యం. 

భారతీయులందరం కలిసికట్టుగా ఉన్నారు అన్న భావాన్ని బ్రిటీషర్లకు తెలియజేయడం మరొక ఉద్దేశ్యం

భాద్రపద శుక్ల చతుర్థి నుంచి భాద్రపద శుక్ల చతుర్థి  వరకు గణేష్ వేడుకలను జరుపుకోవాలని తిలక్ పిలుపునిచ్చారు.

అప్పట్లోనే మహారాష్ట్ర ప్రజలందరూ పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలను జరుపుకున్నారు. 

వినాయక చవితిని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు.