త్వరలో టెస్లా నుంచి సరికొత్త గేమింగ్ స్మార్ట్ ఫోన్లు విడుదల కానున్నట్లు సమాచారం.

కార్లు, స్పేస్ ఎక్స్ వంటి బడా ప్రాజెక్టులే కాదు ఇప్పుడు టెస్లా ఖాతాలో ఫోన్లు కూడా చేరుతున్నట్లు తెలుస్తోంది.

అది కూడా సాదాసీదా ఫోన్లు అయితే కాదు.

మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ అని టెక్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఈ ఫోన్ పేరు కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది.

కానీ, టెస్లా వైపు నుంచి అయితే ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు.టెస్లా నుంచి వస్తోందని చెప్పుకొనే స్మార్ట్ ఫోన్ ను ‘మోడల్ పై’ అని పిలుస్తారట.

మరోవైపు ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా ఓ రేంజ్ లోఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న బడా బడా కంపెనీల ఫోన్లకు ఏ మాత్రం తీసిపోదనే చెబుతున్నారు.

ఫోన్ వెనుక వైపు టెస్లా కంపెనీ అని తెలియజేసేలా ‘T’ అని ఉంటుందని తెలుస్తోంది.

ఫోన్ వెనుక సగభాగం నేవీ బ్లూ, మరో సగం స్కై బ్లూ కలర్ లో ఉంటుందని సమాచారం. 

ఈ ఫోన్ కు 108 మెగా పిక్సల్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 898 ప్రాసెసర్ తో పనిచేస్తుందని చెబుతున్నారు.

4K రెజల్యూషన్ తో 6.5 ఇంచెస్ స్క్రీన్ ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ ఫోన్ వచ్చే ఏడాది మార్కెట్ లోకి విడుదుల కానున్నట్లు తెలుస్తోంది.

దీని ధర కూడా ఇండియన్ కరెన్సీలో రూ.60 వేల నుంచి రూ.90 వేల వరకూ ఉంటుందని సమాచారం.