మార్కెట్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి డిమాండ్ ఓ రెంజ్ లో పెరిగింది.

ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేయడం ప్రారంభించాయి.

అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లు అనగానే కాస్త ఖరీదుగా ఉంటాయి.

అందుకే చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలి అంటే కాస్త వెనకాడుతుంటారు.

కానీ, ఫుజియామా అనే కంపెనీ మాత్రం కేవంల రూ.49,499 ప్రారంభ ధరతో ఈవీని భారత్ లో లాంఛ్ చేసింది.

ఈ కంపెనీ 2025 కల్లా భారత్ లో 3 యూనిట్లను ప్రారంభించనుంది.

రాజస్థాన్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో యూనిట్స్ ని ప్రారంభిచనుంది.

ఈ 3 యూనిట్ల ద్వారా ఏటా 60 లక్షల యూనిట్స్ తయారీనే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ఫుజియామా స్కూటీ భారత్ లో రూ.49,499 నుంచి గరిష్ఠంగా రూ.99,999 వరకు ధర నిర్ణయించారు.

ఈ స్కూటీని మీరు కొనుగోలు చేస్తే.. మీకు పెట్రోల్ ఖర్చు మాత్రమే కాదు, రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఖర్చు కూడా ఉండదు.

ఇది రెడ్, వైట్ అండ్ రెడ్, బ్లూ, బ్లూ- లైట్ గ్రే, లైట్ గ్రే కలర్ వేరియంట్స్ లో వస్తోంది.

ఈ స్కూటీలో ఎల్సీడీ స్పీడో మీటర్, ఎల్ఈడీ లైట్స్, 5 గంటల ఛార్జింగ్ టైమ్ తో వస్తోంది.

ఇందులో 1.56 కిలో వాట్స్ లీథియమ్ అయాన్ డిటాట్చబుల్ బ్యాటరీ ఉంది.

మీరు ఎంచుకున్న మోడల్ ని బట్టి గరిష్టంగా 140 కిలోమీటర్ల రేంజ్ తో ఈ స్కూటీలు వస్తున్నాయి.