కొర్రల్లో గ్లూటిన్ అనే పదార్థం అత్యల్పంగా ఉన్నందున ఏడీహెచ్ డీ, ఆజిటిమ్, గ్యాస్ట్రిక్ సమస్యలకు మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు.
మలబద్ధకాన్ని తొలగించడంలో కొర్రలు అద్భుతంగా పనిచేస్తాయి.
మన శరీరానికి మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, కాల్షియం, జింక్ , పొటాషియం సమృద్దిగా లభిస్తుంది.
కొర్రలో ఉండే మెగ్నిషియం మైగ్రేన్ తల నొప్పులు , హార్ట్ ఎటాక్ లు , గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
మహిళలకు కొర్రలో ఉండే ఐరన్ రక్తహీనతను తొలగిస్తుంది. వరికి బదులుగా కొర్రలను తింటే చాలా మంచి ఫలితాలు వస్తాయి
కొర్రలలో పీచు సమృద్దిగా ఉండుట వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి డయబెటిస్, అధిక బరువు నియంత్రణలోను సహాయపడుతుంది.
కొర్రలలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది.
నరాల బలహీనత, బీపీ ఉండేవారికి, ఆస్తమా ఉండే వారు కొర్రల్ని తింటే ఆ సమస్యల నుండి బయట పడవచ్చు.
జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచి వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ ని తగ్గిస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారిలో నాడీ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.
కొర్రల ద్వారా నాడీవ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపే మోరెల్ విటమిన్ లభిస్తుంది.
బెల్స్ పాల్సీ, మల్టిపుల్ స్క్లెరోసిస్ సమస్యలకు కొర్రలు చెక్ పెడతాయి.