తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పింది.

త్వరలోనే ఒకేసారి దాదాపుగా లక్షమందికి పైగా ఉపాధి అవకాశాలు దక్కనున్నట్లు తెలిపింది.

యాపిల్ ఫోన్ తయారీ సంస్థ హోన్ హై ఫాక్స్ కాన్‌ తమ తయారీ యూనిట్ ని తెలంగాణలో స్థాపించనున్నట్లు ప్రకటించింది.

ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో స్వయంగా ఫాక్స్ కాన్ కంపెనీ ఛైర్మన్ ‘యంగ్ ల్యూ’ వెల్లడించారు.

తాము రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నామని త్వరలోనే పనులు ప్రారంభిద్దామని వెల్లడించారు.

త్వరలోనే యాపిల్ ఫోన్ తయారీ సంస్థ హోన్ హై ఫాక్స్ కాన్ తమ తయారీ యూనిట్ ని ప్రారంభించినుంది.

మార్చి 2న ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆ సంస్థ ఛైర్మన్ యంగ్ ల్యూ సమావేశమై.. అవగాహన ఒప్పదం కుదుర్చుకున్నారు.

అందుకు తగినట్లుగానే ఆ సంస్థ నుంచి యంగ్ ల్యూ పేరిట రాష్ట్ర ప్రభుత్వానికి ఓ అధికారిక లేఖ అందింది.

రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ లో ఫాక్స్ కాన్ ప్లాంట్ తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కేసీఆర్ విజన్ చూసి తాను స్ఫూర్తి పొందినట్లు యంగ్ ల్యూ వెల్లడించారు.

ఈ ఫాక్స్ కాన్ ప్లాంట్ ఏర్పాటుకు 250 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికే 187 ఎకరాలు ప్రభుత్వం కేటాయించినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్షమందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.

ఇప్పటికే బెంగళూరులో ఓ తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఫాక్స్ కాన్  కర్ణాటక ప్రభుత్వాన్ని సంప్రదించింది.

కర్ణాటక ప్రభుత్వం- ఫాక్స్ కాన్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరిన తర్వాతే సీఎం బసవరాజు బొమ్మై ప్రకటించారు.

బెంగళూరులో 300 ఎకరాల్లో ఐఫోన్ తయారీ కేంద్ర రాబోతున్నట్లు ప్రకటించారు. దాదాపు లక్ష మందికి ఉపాధి లభించనుంది.