చలికాలం వచ్చిందంటే చాలు, శరీరం చలితో గజ గజ వణికిపోతుంటుంది.

అయితే ఈ చలిని కొన్ని ఆహార పదార్థాలతో నియంత్రించవచ్చు.

శరీరంలో ఈ ఆహార పదార్థాలను పంపిస్తే అవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.

మొక్క జొన్నతో చేసిన రొట్టెలు తింటే పోషకాలతో పాటు శరీరాన్ని వెచ్చగా కూడా ఉంచుతాయి.

మొక్కజొన్న రొట్టెల్లో వెన్న,బెల్లం నంజుకుని తింటే ఆ రుచే సూపర్ ఉంటుంది.  

చలికాలంలో క్యారెట్ తింటే మంచిది. క్యారెట్ తో చేసిన హల్వా తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే.

క్యారెట్లు తినడం వల్ల నోటి సమస్యలు ఉండవు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

క్యారెట్లు, క్యారెట్ హల్వా తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది.

రకరకాల కూరగాయలు, నూడిల్స్ తో చేసిన కూరగాయల సూప్ ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా చలికాలంలో

ఈ కూరగాయల సూప్ తీసుకుంటే శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది.  జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమవుతాయి.  

చలికాలంలో తినాల్సిన ఆహార పదార్థం గోండు లడ్డు. ఇది చలిని ఎదుర్కొనేందుకు కావాల్సిన శక్తిని శరీరానికి ఇస్తుంది.

ఈ గోండు లడ్డులో వేడి పెంచే లక్షణం ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు ఎముకలను దృఢంగా ఉంచుతాయి.

బెల్లం, వేరుశనగ చిక్కీలు, నువ్వుల చిక్కీలు చలికాలంలో తింటే మంచిది. 

బెల్లం, వేరుశనగతో చేసిన చిక్కీలో పోషకాలు అధికంగా ఉంటాయి. చలిని తట్టుకోవడానికి ఈ చిక్కీలు బాగా ఉపయోగపడతాయి.