వేసవి కాలం ఎండ వేడిని తట్టుకోవాలంటే బాడీని వేడిని తగ్గించే చలువ పదార్థాలను కడుపులోకి పంపించాలి.
మిగతా కాలాలతో పోలిస్తే ఎండాకాలంలో జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. ఈ కారణంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, అపానవాయువులు వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
అయితే ఈ సమస్యలను అధిగమించడానికి వేసవి సీజన్ లో పెరుగు, పుచ్చకాయ, అనాసపండు వంటి ఆహారాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్, అసిడోఫిలస్, బైఫిడస్ వంటి బ్యాక్టీరియాలు జీర్ణక్రియకు సహాయపడతాయి.
పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది.
దీని వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. భోజనం చివరిలో పెరుగన్నం తింటే ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగు జీర్ణక్రియను వృద్ధి చేసి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
ఇక వేసవి కాలంలో పుచ్చకాయలు తింటే చలువ చేస్తుంది. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది
దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య రాదు. పుచ్చకాయలో పొటాషియం ఉంటుంది. ఇది ఉబ్బరం, గ్యాస్ సమస్యలు రాకుండా నివారిస్తుంది.
పసుపు జీర్ణ సమస్యలన్నిటికీ ఔషధంలా పని చేస్తుంది. పసుపు పిత్త రసం ఉత్పత్తిని పెంచడమే గాక కొవ్వులు సులువుగా జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది.
వేసవిలో పాలకూర తింటే చాలా మంచిది. జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచడంలో పాలకూర బాగా పని చేస్తుంది. గ్యాస్, అపానవాయువులను తగ్గిస్తుంది.
అనాసపండులో 85 శాతం నీరు ఉంటుంది. ఇందులో ఉండే జీర్ణ ఎంజైములు జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది.
ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియ సాఫీగా సాగడానికి తోడ్పడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అనాసపండు తరచుగా తీసుకుంటే అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి.
వేసవిలో ఎసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్యలు ఎక్కువగా ఉంటాయి. నిమ్మరసం తీసుకుంటే ఈ సమస్యలు దూరమవుతాయి. నిమ్మరసం పేగులను శుభ్రంగా ఉంచి.. జీర్ణక్రియ సజావుగా జరిగేలా సహాయపడుతుంది.
వేసవిలో తినాల్సిన వాటిలో సోంపు గింజలు. ఇందులో ఉండే నూనెలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
కడుపు ఉబ్బరం, గ్యాస్, అపానవాయువులు వంటి సమస్యలను దరిచేరనివ్వకుండా కాపాడతాయి. భోజనం తర్వాత సోంపు గింజలను తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
కీరదోస కడుపు ఉబ్బరం సమస్యని దూరం చేస్తుంది. కీరదోసలో ఉండే సిలికా, విటమిన్ సి పేగుల పనితీరుని మెరుగుపరుస్తాయి. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా సేకరించబడింది. దీని మీద అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.