మన అందాన్ని పెంచే వాటిలో పెదాలు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అయితే చాలా మంది పెదాలు పొడిబారిపోయి.. జీవం లేకుండా ఉంటాయి.

ఇక కొందరిని నలుపు రంగు పెదాలు వెధిస్తుంటాయి.

పెదాలు ఇలా నల్లగా మారడానికి ముఖ్య కారణం సిగరెట్లు తాగడం. ఆ అలవాటు లేకున్నా పెదాలు నల్లగా మారుతున్నాయంటే.. ఏదో అనారోగ్య సమస్య ఉన్నట్లే.

మరి నల్లగా మారిన పెదాలను ఎర్రగా మార్చుకోవాలంటే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి.

బీట్‌రూట్‌ జ్యూస్‌ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో ఒకటి పెదాల నలుపు వదిలించడం.

నల్లని పెదాలు ఎర్రగా మారాలంటే.. కొంచెం బీట్‌రూట్‌ జ్యూస్‌లో తేనెను కలిపి.. ఆ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేయాలి.

ఇలా తరచుగా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారతాయి.

డెడ్‌ స్కిన్‌ సెల్స్‌ని తొలగించడంలో నిమ్మకాయ అద్బుతంగా పని చేస్తుంది.  

అలానే పెదాల నలుపు వదిలించడంలో కూడా నిమ్మకాయ ఉపయోగపడుతుంది.

ఇందుకోసం అరచెక్క నిమ్మకాయను తీసుకుని.. దాని మీద చక్కెర వేసి.. పెదాల మీద సున్నితంగా రుద్దాలి.

ఇది పెదాలకు స్క్రబ్‌లా ఉపయోగపడుతుంది. దీన్ని రెగ్యూలర్‌గా ఫాలో అయితే కొన్ని రోజుల్లోనే పెదాలు ఎర్రగా మారతాయి.

ఇందుకోసం అరచెక్క నిమ్మకాయను తీసుకుని.. దాని మీద చక్కెర వేసి.. పెదాల మీద సున్నితంగా రుద్దాలి.

కలబంద గుజ్జుతో తయారు చేసిన లిప్‌బామ్‌ను నిత్యం పెదాలకు వాడటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. 

పైన చెప్పిన చిట్కాలను ఫాలో అయ్యి ఎర్రని పెదాలను సొంతం చేసుకొండి.