ఇంట్లో వాసన కిచెన్‌ నుంచే వ్యాపిస్తుంది కనుక వంట గదిని శుభ్రంగా ఉంచుకొండి.

చెత్త డబ్బాను ఏరోజుకారోజు ఖాళీ చేసి నీట్‌గా ఉంచుకోవాలి.

ఫ్రిజ్‌ ఒపెన్‌ చేయగానే వాసన బయటకు వస్తుంది.

ఇలా రాకుండా ఉండాలంటే.. గిన్నెలో వంటసోడా లేదా నిమ్మ చెక్కను ఉంచి ఫ్రిజ్‌లో ఓ మూల ఉంచితే వాసన రాదు.

బయట వర్షం కురుస్తున్నప్పుడు.. ఇంట్లోని మందపాటి దుప్పట్లు, కార్పెట్‌ వంటి వాటి నుంచి చెమ్మ వాసన వస్తుంది.

దీన్ని నివారించాలంటే.. రెండు చెంచాల వంటసోడాకు ఏదైనా ఎసెన్షియల్‌ నూనె కలిపి.. వాటిపై చల్లి.. రాత్రంతా ఉంచితే.. తెల్లారేసరికి వాసన మాయం అవుతుంది.

ఈ సీజన్‌లో మధ్యాహ్నం కిటికీలు తీసి ఉంచాలి. లోపల ఉన్న చెమ్మ బయటకు పోతుంది. లేదంటే వంటింటి వాసన ఇళ్లంతా వ్యాపిస్తుంది

ఎయిర్‌ ఫ్యూరిఫయర్‌లో నాలుగైదు చుక్కల లెమన్‌గ్రాస్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసి ప్లగ్‌ అమర్చితే ఇల్లంతా తాజా సువాసలతో నిండిపోతుంది.

ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే దాని బెడ్‌ వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి.

రెండు చెంచాల వంట సోడాకు రెండు కప్పుల డిస్టిల్డ్‌ వాటర్‌, 10-12 చుక్కల పెట్‌ సేఫ్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసి.. దాని బెడ్‌పై స్ప్రే చేస్తే.. వాసన పోతుంది.

మందపాటి తువ్వాళ్లను ఇంట్లో ఆరబెట్టకూడదు. వీటి నుంచే వచ్చే వాసన ఇళ్లంతా వ్యాపించి ఇబ్బంది పెడుతుంది.

అందుకనే వీటిని రెండు కప్పుల వెనిగర్‌ కలిపిన వేడి నీటిలో రాత్రంతా నాననిచ్చి.. ఉదయం వాషింగ్‌ మిషన్‌లో వేయాలి. బాగా డ్రయర్‌ చేసి ఆరబెడితే దుర్వాసన దూరమవుతుంది

తడి బూట్లను ఆరనిచ్చి ర్యాక్‌లో సర్దడం, సాక్స్‌ ఎప్పటికప్పుడు తీసి ఉతకడం చేయడం వల్ల దుర్వాసన రాదు.

హాల్‌ మధ్యలో టీపాయిపై డ్రై ఫ్లవర్స్‌ నింపిన బౌల్‌ ఉంచి.. ఇందులో రెండు చుక్కల లెమన్‌, వెనీలా, లావెండర్‌, గంధం, పెప్పర్‌మెంట్‌ ఇలా ఏదైనా ఒక ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేస్తే ఇళ్లంతా పూల పరిమళంతో నిండిపోతుంది.