ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులు పని సమయంలో మరింత అలసటకు గరవుతున్నారు.
పని గొడవలో పడి ఆరోగ్యంపై దృష్టి సారించడం లేదు. తద్వారా ఊరికే అలిసిపోతుంటారు.
అలా కాకుండా రెట్టిచ్చిన ఉత్సాహంతో పని చేసేందుకు కొన్ని చిట్కాలు ఇప్పుడు చూద్దాం.
కార్యాలయంలో వరుసగా గంట, గంటన్నరకు మించి కూర్చోకండి. ఒకసారి లేచి అలా నడవండి.
పని భారంగా అనిపించినప్పుడు ఒక టీ లేదా కాఫీ తాగి రిలాక్స్ అవ్వండి. గ్రీన్ టీ అయితే ఇంకా బెటర్.
ఒత్తిడి ఎక్కవ అయినప్పుడు కూర్చున్న కుర్చీలోనే కాసేపు మెడిటేషన్ చేసుకోండి.
మధ్యలో ఒక పది నిమిషాలు నడిచి రండి. దాని ద్వారా కొత్త ఉత్సాహం వస్తుంది.
ఒకే పని పదే పదే చేస్తూ బోర్ కొడుతుంటే.. మీకు ఇష్టమైన వారితో కాసేపు ఫోన్లో మాట్లాడండి.
స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు.. ఒక పది నిమిషాలు మీకు నచ్చిన సంగీతం వినండి.
ఒత్తిడిని కంట్రోల్ చేసుకునేందుకు 5 నిమిషాలు వేగంగా గాలి తీసుకుని వదులుతూ ఉండండి. స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది.
విశ్రాంతి లేకుండా చాలా రోజులుగా పని చేస్తూ ఉన్నారా? అయితే సెలవు తీసుకుని ఏదైనా ట్రిప్‌కు వెళ్లిరండి.
పని ఎంత ముఖ్యమో.. ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమే. అందుకే తప్పనిసరిగా వ్యాయామం చేస్తుండండి.
మీ ఆహారపు అలవాట్లు కూడా ఆఫీస్ లో మీ వర్క్ కేపబిలిటీని నిర్ణయిస్తాయి.
కార్యాలయాల్లోనూ జంక్ ఫుడ్ తినడం మానేయండి. కాఫీ, టీకి బదులు గ్రీన్ టీ తాగండి.