సాధారణంగా ఎవరైనా సరే తమ శిరోజాలు మృదువుగా, కాంతివంతంగా కనిపించాలని కోరుకుంటారు.

జుట్టుకు సంబంధించి మనకు వచ్చే సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి.

చుండ్రు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. విటమిన్ల లోపం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు.

కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే చుండ్రు సమస్య నుంచి త్వరగా విముక్తి పొందవచ్చు. 

ఇంట్లో అందరూ ఒకే దువ్వెనతో తల దువ్వుకుంటారు. ఎవరి దువ్వెనతో వారే దువ్వుకోవాలి. 

ఒకరి తలలో ఉండే ఇన్‌ఫెక్షన్లు, వైరస్‌లు దువ్వెనల ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయి. కనుక ఎవరి దువ్వెనలను వారు వాడితేనే మంచిది.

చుండ్రు సమస్య ఉన్నవారు తరచూ వేప ఆకుల పేస్టు పెట్టుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.

హెయిర్ ఆయిల్స్‌కు బదులుగా స్వచ్ఛమైన కొబ్బరినూనెను జుట్టుకు రాయాలి.

విటమిన్‌ ఎ, సి, ఇ ఉన్న ఆహారాలను బాగా తినడంతోపాటు.. తలకు రక్షణ క్యాప్‌లు ధరించడం వల్ల చుండ్రు సమస్య ఉత్పన్నం కాకుండా చూసుకోవచ్చు.

కలబంద గుజ్జును తలకు బాగా పట్టించి 15 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి.శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.