నేడు ప్రతి వ్యక్తి జీవితంలో స్మార్ట్ ఫోన్ ప్రాముఖ్యత పెరిగింది.

మొబైల్తో చాలా పనులు సులువుగా జరిగిపోతున్నాయి. కానీ బ్యాటరీ తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

అలా మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ కూడా త్వరగా ఖాళీ అవుతోందా? అయితే ఈ టిప్స్ మీ కోసమే

లైవ్ వాల్ పేపర్స్ ఉపయోగిస్తున్నట్లయితే స్టాటిక్ వాల్ పేపర్ సెట్ చేసుకోండి

యానిమేషన్ వాల్ పేపర్స్ బ్యాటరీపై ప్రభావం చూపిస్తాయి.

ఫోన్లో జీపీఎస్ ఫీచర్ అవసరం లేనప్పుడు ఆఫ్ చేసి ఉంచండి.

ఫోన్ బ్యాటరీ డ్రెయిన్ సమయంలో బలమైన ఆయుధాలలో  ఒకటి పవర్ సేవింగ్ మోడ్.

స్క్రీన్ బ్రైట్ నేస్ తగ్గించండి లేదా ఆటో బ్రైట్ నెస్ ఆన్ చేయండి.

అవసరంలేని సమయంలో మొబైల్ ను ఎయిర్ ప్లేన్ మోడ్ లో కూడా ఉంచండి.

స్మార్ట్ ఫోన్ లో వైఫై, బ్లూటూత్ , NFC ఫీచర్స్ ను ఆఫ్ చేసుకోవాలి.

మీకు అవసరం లేని యాప్స్ నోటిఫికేషన్స్ ను ఆఫ్ చేయండి.

మీ మొబైల్ లో ఉపయోగించని యాప్స్ డిలిట్ చేయండి.

డిలిట్ ఆప్షన్  లేకపోతే యాప్స్ ను డిసేబుల్ చేయండి.

పై టిప్స్ పాటించడం ద్వారా  స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సేఫ్ గా ఉంచుకోవచ్చు.