చాలా మందికి గోర్లు పెంచుకోవడం అంటే మహా ఇష్టం. కానీ అవి విరిగిపోవడమో, అందంగా లేకపోవడం జరుగుతాయి.

మరి అలా విరిగిపోకుండా, అందంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి.

కొబ్బరి నూనెతో వారానికి రెండు, మూడు సార్లు గోర్లను మర్దనా చేయడం వల్ల గోర్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. 

ఆలివ్ నూనెలో ఉండే విటమిన్ ఇ గోర్లు త్వరగా పెరిగేలా సహాయపడుతుంది. 

ఆలివ్ ఆయిల్ తో మర్దనా చేయడం వల్ల గోర్లు ఆరోగ్యంగా కూడా ఉంటాయి.   

అరటి పండుని మిక్సీలో వేసి ఆడించగా వచ్చిన మిశ్రమాన్ని పేస్ట్ లా చేయాలి. 

ఆ పేస్ట్ ని చేతులకు, గోర్లకు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. 

ఇలా చేయడం వల్ల చేతులు పొడిబారకుండా ఉంటాయి. గోర్లు అందంగా మారతాయి.  

నిమ్మరసంతో గోర్ల మీద ఉండే మరకలను, మట్టిని తొలగించుకోవచ్చు. 

నిమ్మరసాన్ని గోర్ల మీద అప్లై చేసి.. అరగంట తర్వాత రోజ్ వాటర్ లో ముంచిన కాటన్ తో తుడవాలి.

దీని వల్ల గోర్లు అందంగా, ఆకర్షణీయంగా మెరుస్తాయి.

కలబంద కూడా గోర్లు వేగంగా పెరిగేందుకు దోహదపడుతుంది. రోజ్ వాటర్, కలబంద మిశ్రమాన్ని మిక్స్ చేసి.. పది నిమిషాల పాటు గోర్లపై మర్దనా చేయాలి.

ఇలా చేస్తే గోర్లు దృఢంగా మారతాయి.

బాదం నూనె వల్ల కూడా గోర్లు బలంగా తయారవుతాయి.

రాత్రి నిద్రపోయే ముందు గోర్లకి బాదం నూనె రుద్దితే.. అందంగానూ, బలంగానూ తయారవుతాయి.

బాదం, వాల్ నట్స్, బీన్స్, చేపలు వంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల గోర్లు విరగడం, పెరగకపోవడం, రంగు పాలిపోవడం వంటి సమస్యలు రావు.