వేసవి కాలం వచ్చేసింది.. భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.
గతంతో పోలిస్తే ఈ ఏడాది ఎండలు మండిపోతూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఇలాంటి సమయంలో ఎండలకు తిరిగే వారికి వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే వేసవి కాలం వడదెబ్బ నుంచి తప్పించుకునేందుకు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
వీలైనంత వరకు ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడం మంచిది.
రోడ్లపై విక్రయించే ఆహారం, పానియాలను అసలు తీసుకోవద్దు.
మాంసాహారాన్ని తగ్గించి.. తాజాగా కూరగాయాలు తినాలి.
తరచూ నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీల్లు ఎక్కువగా తీసుకోవాలి
వేసవి కాలం ఆహారాన్ని సాధ్యమైనంత మితంగా తినాలి
బయటకు వెళ్లే సమయంలో కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి.
సాధ్యమైనంత వరకు ఉదయం, సాయంత్ర వేళ్లలో మాత్రమే బయటకు వెళ్లండి
అత్యవసరంగా బయకు వెళ్లాల్సి వస్తే.. గొడుగు తీసుకెళ్లాలి.
ఇంట్లో కిటీకిలు తెరచి ఫ్యాన్ వేసి గది చల్లబడేలా చూసుకోవాలి
ప్రతి రోజు మర్చిపోకుండా ఇంట్లో మజ్జిగా చేసుకుని తాగాలి
ఇలాపై జాగ్రత్తలు పాటిస్తూ ఉండే వడ దెబ్బ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.