మలేరియా, డయారేయా, వైరల్ ఫీవర్ వంటి సమస్యలు ప్రస్తుత వాతావరణంలో చాలా కామన్.

వీటికి కలుషిత నీరు, ఆహారం, దోమలు ప్రధాన కారణాలు

వర్షాకాలంలో స్ట్రీట్‌ఫుడ్‌కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. 

మరీ ముఖ్యంగా పానీ పూరీని తినకపోవడమే మంచిది.

తాజా కూరగాయలతో వండిన వంటను తినడం, శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగండి.

వంట చేయడానికి ముందు చేతులను శుభ్రంగా కడగాలి. వంటకోసం శుభ్రమైన పాత్రలను వాడాలి.

ఫుడ్ తినే ముందు, టాయిలెట్‌కి వెళ్ళిన ప్రతిసారి చేతులను శుభ్రంగా కడగాలి. 

బయటికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి చేతులను తప్పకుండా కడగాలి. 

వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచే సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్ తీసుకోవాలి.

దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు నోటిని కవర్ చేయాలి. మీ ముక్కు, కాళ్ళని తాకడం లాంటివి చేయొద్దు.

నీరు తాగే ముందు మరిగించడం మరవొద్దు. 

ఇంట్లో సాయంత్రం పూట దోమలు రాకుండా కిటికీలు, తలుపులు మూయడం మంచిది. 

పిల్లలు నిద్రపోయే ముందు, బయటికి వెళ్ళే ముందు దోమలు కుట్టకుండా లోషన్ రాయండి. మీ కాళ్లు, చేతులను కప్పి ఉంచే డ్రెస్సెస్ వేసుకోండి.

ఇంట్లో నీరు నిల్వ లేకుండా చేసుకోవాలి.