మనలో చాలా మందికి పులిపిర్ల సమస్య ఉంటుంది.

చ‌ర్మంపై పులిపిర్లు ఉండ‌డ‌మ‌నేది చాలా సాధార‌ణ‌మైన స‌మ‌స్య. 

పులిపిర్లనే ఆంగ్లంలో వార్ట్స్‌ అని అంటారు. 

హ్యూమ‌న్ పాపిలోమా అనే వైర‌స్ కార‌ణంగా  చ‌ర్మంపై పులిపిర్లు వ‌స్తాయి. 

పులిపిర్లు ఎక్కువ‌గా ముఖం, చేతులు, కాళ్లు, మెడ భాగాల్లో వ‌స్తుంటాయి.

పులిపిర్లను తొలగించడానికి చాలా మంది గిల్లడం, బ్లేడుతో కోయ‌డం వంటివి చేస్తూ ఉంటారు.

మరికొంద‌రు పులిపిర్లను తొల‌గించే క్రీముల‌ను వాడుతూ ఉంటారు.

అయితే స‌హ‌జసిద్ధంగా పులిపిర్లను తొల‌గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక అర టీ స్పూన్ తెల్లగా ఉండే టూత్ పేస్ట్, వంటసోడా ఆముదం నూనెలను కలిపి మిశ్రమం చేయాలి. 

ఆ మిశ్రమాన్ని రాత్రి ప‌డుకునే ముందు పులిపిర్ల మీద రాసుకోవాలి.

ఇలా చేయడం వలన చిన్న పులిపిర్లు 3 నుండి 7 రోజుల వ్యవధిలోనే రాలిపోతాయి.

 మరొక చిట్కా...త‌మ‌ల‌పాకు, త‌డి సున్నాన్ని ఉపయోగించి పులిపిర్ల సమస్యను తొలగించుకోవచ్చు.

తమలపాకుల కాడతో తడి సున్నాన్ని తీసుకుని పులిపిర్ల మీద రాసి.. కొద్ది సమయం మర్దనం చేయాలి.

ఇలా క్రమం త‌ప్పకుండా చేయ‌డం వ‌ల్ల 3-4 రోజుల్లోనే పులిపిర్లు రాలిపోతాయి.

ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల నొప్పి లేకుండా చాలా సులువుగా మ‌నం పులిపిర్లను తొల‌గించుకోవ‌చ్చు