చాలామంది ఎండాకాలం తమ చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అంటూ తెగ కష్టపడిపోతుంటారు.

అయితే ఈ వేసవిలో మీ చర్మం అందంగా మెరిసిపోవాలి అంటే ఈ 3 అలవాట్లు చేసుకోవాలి.

చర్మం గ్లో రావాలి అంటే ఎక్కువగా ఎక్స్ టర్నల్ కేర్ మీదే దృష్టంతా పెడుతుంటారు.

చర్మం మెరిసి పోవడానికి ఏవేవో క్రీములు వాడటం, ఫేస్ ప్యాక్ లు వేసుకోవడం చేస్తుంటారు.

అయితే చర్మం మెరిసిపోవాలి అన్నా, చర్మం సౌందర్యంగా ఉండాలన్నా కూడా జాగ్రత్తలు అనేవి లోపలి నుంచి రావాలి.

చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్ చర్మానికి స్ట్రక్చరల్ సపోర్ట్ ఇస్తుంది.

ప్లాంట్ బేస్ట్ ప్రొటీన్ ఒక్క చర్మం మాత్రమే కాదు.. జుట్టుని కూడా ఆరోగ్యంగా ఉంచుంది.

నట్స్, బీన్స్, గుమ్మడికాయ, చిక్కుళ్లు, క్యారెట్, బ్రస్సెల్స్ మెలకలు తింటే మంచిది.

స్కిన్ మృదువుగా, ఆరోగ్యంగా ఉండాలంటే మీ శరీరంలో కొల్లాజెన్ ప్రొటీన్ పుష్కలంగా ఉండాలి.

ఫైబ్రో బ్లాస్ట్ ల ద్వారా కొల్లాజెన్ చర్మంలో తయారవుతుంది.

కొల్లాజెన్ ని ట్యాబ్లెట్లు, జెల్, పౌడర్ రూపంలో పొందవచ్చు.

పాలకూర, బ్రోకలి వంటివి తినడం వచ్చే విటమిన్ సీ, క్లోరోఫిల్ కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదపడతాయి.

గ్లూటా తియోన్ కూడా చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుస్తుంది.

ఆవకాడో, వాల్ నట్, నారింజ, టమాటా వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గ్లూటాతియోన్ స్థాయి పెరుగుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు ఈ విషయాలు చెప్పడం జరిగింది. చర్మానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి.