చాలా మంది స్కిన్ కేర్ అంటే.. కేవలం ఆడవారికి మాత్రమే అనుకుంటారు. కానీ మగవారికి కూడా స్కిన్ కేర్ చాలా అవసరం.
స్కిన్ కు సంబంధించినంత వరకు చాలా మంది అబ్బాయిలు లైట్ తీసుకుంటారు. దాన్ని వల్ల అనేక చర్మ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.
ఇక మగవారి స్కిన్ కేర్ కోసం నిపుణులు కొన్ని చిట్కాలను సూచించారు. అవి:
యట తిరిగి వచ్చాక.. మెుహాన్ని కంపల్సరీ సోప్ లేదా.. ఫేస్ వాష్ తో కడుక్కోవాలి. లేదంటే ఫేస్ పై డస్ట్ అలాగే ఉండి చర్మ సమస్యలకు దారి తీస్తుంది.
ఇక బయటకి వెళ్లే ముందు సన్ స్క్రీన్ క్రీమ్ ను అప్లై చేసుకుంటే మంచిది.
ఇది సూర్యుడి నుంచి వచ్చే కిరణాల నుంచి రక్షణ కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది ఆడవాళ్లు మాత్రమే గోర్లకు మెనిక్యూర్ చేసుకుంటారు అనుకుంటారు.
కానీ మగవారు సైతం మెనిక్యూర్ చేసుకోవచ్చు. తద్వారా మీ చేతులు అందంగా కనిపిస్తాయి.
చాలా మంది అమ్మాయిలు మగవారిలో నచ్చేది ఏమిటంటే? అబ్బాయిల గడ్డం అనే చెబుతారు.
అలా అని మీరు దేవదాసులా గడ్డాలు పెంచుకోవడం మంచిది కాదు. గడ్డం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని నిపుణుల వాదన.
చర్మం మిలమిల మెరవాలి అని అనుకుంటున్నారా? అయితే మీరు శరీరానికి తగినంతగా నిద్ర అందివ్వాలి. నిద్ర చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.
అతి ముఖ్యమైంది బాడీకి తగినంతగా నీరు అందివ్వడం. బాడీలో నీరు తక్కువైతే చర్మం పొడిబారిపోతుంది అని వైద్యులు చెబుతున్నారు.
మీ చర్మం ఎప్పుడూ ఫ్రెష్ గా ఉండాలి అనుకుంటే.. మీ ఆహారంలో ఎక్కువ శాతం పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి.