సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంతో డిమాండ్ ఉంటుంది.

చాలా మంది కొన్నేళ్ల పాటు కష్టపడి చదివి ఉద్యోగం కొడతారు.

ప్రభుత్వ ఉద్యోగాలు అనగానే చాలా మందికి ముందు కానిస్టేబుల్ ఉద్యోగం గుర్తొస్తుంది.

ఇప్పుడు ఒక బుడ్డోడు మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు.

ఎందుకంటే ఆ చిన్నారి ఐదేళ్లకే చైల్డ్‌ కానిస్టేబుల్ అయ్యాడు.

అయితే అతను కానిస్టేబుల్ కావడం వెనుక మిరాకిల్ ఏం లేదు.. విషాదం దాగుంది.

అవును అతను కానిస్టేబుల్ కుమారుడు. అతని తండ్రి చనిపోగా ఆ ఉద్యోగాన్ని ఈ బుడతడికి ఇచ్చారు.

ఛత్తీస్ గఢ్‌ లోని సుర్గుజా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ఐదేళ్లకే కానిస్టేబుల్ అయిన ఆ చిన్నారి పేరు నమన్ రాజ్వాడే.

అతడిని కానిస్టేబుల్ గా నియమించాలంటూ హెడ్ క్వార్టర్స్‌ ఆదేసాలు జారీ చేశాయి.

సుర్గుజా జిల్లా ఎస్పీ భావనా గుప్తా నమన్ కు నియామక పత్రాన్ని కూడా అందించారు.

నమన్ తండ్రి రాజ్‌ కుమార్ రాజ్వాడే సెప్టెంబర్ 3, 2021లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.

ఆయన ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద నమన్ కు కేటాయించారు.

అయితే నమన్ కు 18 ఏళ్లు నిండిన తర్వాత పూర్తిగా అధికారాలను ఇస్తారు.