గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరులో అరుదైన శివలింగం బయటపడింది.
అర్ధనారీశ్వర రూపంలో ఈ శివలింగం ఉండటం విశేషం.
ఈ లింగం 4వ శతాబ్దంలో ప్రతిష్టించబడిందని పురావస్తు శాస్త్రవేత్త శివనాగిరెడ్డి తెలిపారు.
ఈ ఆలయాన్ని సందర్శించిన ఆయన 4వ శతాబ్దంలో ఆనందగోత్రీలు గుడిని నిర్మించినట్లు కనుగొన్నారు.
ఆనందగోత్రి పేరు మీదుగానే ఈ ఆలయానికి ఆనందేశ్వర ఆలయం అన్న పేరు వచ్చినట్టు తెలిపారు.
1600 ఏళ్లకు పూర్వమే రాజులు అర్ధనారీశ్వర ప్రతిరూపాలు చెక్కారన్నారు.
దేశంలోనే తొలి అర్ధనారీశ్వర లింగం ఇదే అని శివ నాగిరెడ్డి పేర్కొన్నారు.
శివలింగం మీద అర్ధనారీశ్వర ప్రతిరూపాలు చెక్కబడటం ఈ ఆలయంలోనే ఉందని చెప్పారు.
మొదటి అర్ధనారీశ్వర శిల్పం కుషన రాజుల కాలంలో మొదటి శతాబ్దంలో తయారు చేశారన్నారు.
ప్రస్తుతం ఆ లింగం మధుర మ్యూజియంలో ఉందని తెలిపారు.
అది కేవలం శిల్పమేనని, లింగం కాదని అన్నారు.