స్మార్ట్ ఫోన్స్ కి ఎలా అయితే డిమాండ్ పెరిగిందో.. అలాగే స్మార్ట్ వాచెస్ కి కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది.

చాలా కొత్త కొత్త కంపెనీలు కూడా స్మార్ట్ వాచెస్ ని తయారు చేయడం ప్రారంభించాయి.

చాలా మందికి ఏ స్మార్ట్ వాచ్ తీసుకోవాలి? ఎంతలో తీసుకోవాలి అనే విషయంపై అవగాహన ఉండదు.

ప్రస్తుతం ఫైర్ బోల్ట్ కంపెనీ నుంచి విడుదలైన అపోలో స్మార్ట్ వాచ్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మరి.. ఆ స్మార్ట్ వాచ్ ఎలా ఉంది? దానిలో ఏఏ ఫీచర్లు ఉన్నాయి? దాని ధర ఎంతో ఇప్పుడు చూద్దాం.

ఫైర్ బోల్ట్‌ కంపెనీ నుంచి ఇప్పటికే చాలా బడ్జెట్‌ స్మార్ట్ వాచెస్‌ విడుదలయ్యాయి. ఆ లిస్టులోకి మరో స్మార్ట్ వాచ్ చేరింది.

ఈ ఫైర్ బోల్ట్ అపోలో స్మార్ట్ వాచ్ ఎమ్మార్పీ రూ.18,999గా నిర్ణయించారు.

కానీ, ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం 84 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.2,999కే అందిస్తున్నారు.

ఈ స్పెషల్ ప్రైస్ ఎన్ని రోజులు ఉంటుందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇది లిమిటెడ్ టైమ్ అయి ఉండచ్చని చెబుతున్నారు.

ఇంక ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది 1.43 ఇంచెస్ హైరెజల్యూషన్, 466*466 అమ్లోడ్ డిస్ ప్లే, స్మూత్ టచ్ తో వస్తోంది.

ఈ వాచ్ ద్వారా మీరు కాల్ చేయచ్చు, కాల్ రిసీవ్ చేసుకోవచ్చు, కాల్ రిజెక్ట కూడా చేయచ్చు. అలాగే కాల్ హిస్టరీని కూడా యాక్సెస్ చేయచ్చు.

వాయిస్‌ అసిస్టెంట్ కూడా ఉంది. అంతేకాదు మీరు వాచ్ లో గేమ్స్ కూడా ఆడచ్చు. 

118 స్పోర్ట్స్‌ మోడ్స్‌, హార్ట్‌ రేటింగ్, ఎస్పీవోకు మానిటరింగ్ కూడా చేయచ్చు. 

ఐపీ67 వాటర్ రెసిస్టెన్స్‌ తో ఈ వాచ్ ని రూపొందించారు.

5 రోజుల బ్యాటరీ లైఫ్ సామర్థ్యంతో ఈ ఫైర్ బోల్ట్ అపోలో వాచ్‌ వస్తోంది.