పవన్ కల్యాణ్ కొత్త సినిమా 'హరిహర వీరమల్లు'కి కష్టాలు తప్పట్లేదు. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి.

అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం సినిమా కన్ఫర్మ్ అయింది. కొన్నాళ్లకు షూటింగ్ స్టార్ట్ చేశారు.

అయితే కరోనా వల్ల, మూడు లాక్ డౌన్స్ వల్ల షూటింగ్ కి ఇబ్బందులు ఏర్పడ్డాయి.

ఈ టైంలో పవన్ మరికొన్ని సినిమాలు ఒప్పుకున్నారు. వాటిలో 'బ్రో', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ' మూవీస్ ఉన్నాయి.

పవన్ ప్రస్తుతం చేస్తున్న వాటిలో 'హరిహర వీరమల్లు' మొదటిది కానీ దానికంటే ముందే మిగతా సినిమా షూటింగ్స్ పూర్తవుతున్నాయి.

'హరిహర వీరమల్లు' పీరియాడికల్ ఫిల్మ్ కావడంతోపాటు మరికొన్ని కారణాలతో ఇది ఆలస్యమవుతూ వస్తోంది.

ఫైనల్ గా పవన్ తన డేట్స్ అన్నీ సర్దుబాటు చేసుకుని 'హరిహర..' కొత్త షెడ్యూల్ కోసం రెడీ అయ్యాడు.

రేపోమాపో షూటింగ్ అన్నారు. అలాంటిది ఇప్పుడు సడన్ గా 'హరిహర వీరమల్లు' సెట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్ శివారులోని దుండిగల్ ప్రాంతంలో ఈ సినిమా కోసం మొగలు సామ్రాజ్యాన్ని ప్రతిబింబించేలా సెట్ వేశారు.

ఆ మధ్య వర్షాల వల్ల అది దెబ్బతింది. దీంతో రీసెంట్ గానే దాన్ని బాగు చేశారు. తాజాగా ఆదివారం రాత్రి అక్కడ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

దీంతో సెట్ చాలావరకు కాలిపోయింది. ఇలా పవన్ షూటింగ్ కి రెడీ అయిపోయారు, అంతా రెడీ అనుకునే టైంలో ఇలా జరిగిపోయింది.

దీంతో ఇప్పుడు 'హరిహర వీరమల్లు' చిత్రబృందానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలా ఇప్పుడు ఎందుకు జరిగిందా అనుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ విషయం గురించి సమాచారం బయటకొచ్చినా సరే మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వస్తే గానీ అసలు విషయం తెలియదు.

మరి 'హరిహర వీరమల్లు' సెట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగడంపై మీరేం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.