మనం రోజు తీసుకునే ఆహారంలో ఉప్పు ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఆహారానికి రుచిని కలిగించే ప్రధాన దినుసు ఉప్పు.

మన బాడీలో జరిగే జీవక్రియలన్నింటికి లవణం చాలా అవసరం.

ఉప్పును ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా ఈ జీవక్రియలు సక్రమంగా జరుగుతున్నాయి.

సముద్రం నీరు నుంచి తయారు చేసే ఉప్పులో 40 శాతం సోడియం, 60 శాతం క్లోరైడ్ ఉంటుంది. 

అయితే ఈ మధ్యకాలంలో కొందరు అసలు ఉప్పు తినకూడదు అంటున్నారు.

కానీ జాతీయ పోషాకాహార సంస్థ చెబుతున్న లెక్కల ప్రకారం రోజుకు 6 గ్రాముల ఉప్పును ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

కానీ ప్రస్తుతం మన రోజు సగటున 30 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాం. 

ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం అధికంగా చేరి రక్తపోటును పెంచుతుంది.

శరీరంలో సోడియం ఎక్కువైతే కాల్షియం శాతం తగ్గి ఎముకలు డొల్లబారి కీళ్ల నొప్పుల సమస్యలు తలెత్తుతాయి.

అంతేకాక మెదడులో ఆక్సిజన్ శాతం తగ్గి.. బ్రెయిన్ కణాలు దెబ్బ తింటాయి. ఫలితంగా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది.

ఉప్పును అధికంగా తీసుకుంటే.. మూత్రపిండాలు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. అందువల్ల అవి దెబ్బ తినే అవకాశం ఎక్కువ. 

ఉప్పు ఎక్కువైతే ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి కనుకనే మన పూర్వికులు.. దీనికి నీచ స్థానం కల్పించారు.

ఉప్పు తక్కువ తీసుకున్నా.. ఎక్కువ తీసుకున్నా ప్రమాదమే. 

కనుక తగిన మోతాదులో తీసుకుని.. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి