అంజీర లేదా అత్తి పళ్లలో పోషకాలు పుష్కలంగా. అలా అని అతిగా తింటే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకి గుప్పెడు గింజలు తింటే మంచిదని డైటీషియన్స్ చెబుతుంటారు.

ఈ డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యల్ని తగ్గిస్తాయి.

వీటిని మోతాదుకు మించి తినకూడదు. అలా చేయడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకో తెలుసా?

అత్తి పండ్లను తింటే మంచిదే. కానీ అతిగా తినడం వల్ల కాల్షియం లోపిస్తుంది.

ఎందుకంటే ఈ పండులో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలోని కాల్షియంని గ్రహిస్తుంది.

ఇలా జరగడం వల్ల మన శరీరంలో కాల్షియం లోపిస్తుంది. దీంతో శరీరం, ఎముకలు బలహీనపడతాయి.

టేస్టీగా ఉన్నాయని చాలామంది అంజీర పళ్లను ఎక్కువగా తింటుంటారు. కానీ ఇది కడుపును దెబ్బతీస్తుంది.

ఇలా చేయడం వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం, పిత్తులు లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అత్తి పళ్లని తిన్న తర్వాత గ్లాస్ నీరు కచ్చితంగా తాగాలి.

మూత్రాశయ, మూత్రపిండాల వ్యాధులున్న వారు అంజీర పళ్లని ఎక్కువగా తినకూడదు. మోతాదులోనే తినాలి.

ఇలా ఎక్కువగా తింటే.. దీనిలో ఉండే ఆక్సలేట్.. శరీరంలోని అవయవాలను దెబ్బతీస్తుంది. తెల్లరక్తకణాల ద్వారా ఏర్పడే ప్లీహాన్ని తొలగిస్తుంది.

అంజీర పళ్లకు వేడి చేసే గుణం ఉంటుంది. అందుకే వీటిని వేసవిలో ఎక్కువగా తినకూడదు. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఒకవేళ శీతాకాలంలో తిన్నాసరే మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే రక్తస్రావ సమస్య వస్తుంది.

అత్తిపళ్లు అతిగా తింటే పేగులు, కాలేయం దెబ్బతింటుంది. ఈ పండులోని విత్తనాలు త్వరగా అరగవు. దీంతో అజీర్తి సమస్యలు కూడా వస్తాయి.