చలికాలంలో మన రోగనిరోధక శక్తి చాలా తగ్గిపోతుంది. దీంతో చాలా వైరస్ లు మనపై దాడి చేస్తాయి.
అలాంటి వాళ్లు.. ఈ సీజన్ లో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అయితే ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం వాక్కాయలు బాగా ఉపయోగపడతాయి. పులుపు, తీపిగా ఉండే వీటిని నేరుగా తినొచ్చు.
అలా కాకుండా రోటి పచ్చడిగా లేదంటే, పప్పులోను వేసుకుని తీసుకోవచ్చు. పోషకాలు మెండుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
వాక్కాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచటంలో ఇది ఎంతో సహాయపడుతుంది.
హార్ట్ ప్రాబ్లమ్స్ ని రానీయకుండా చేయడంతోపాటు, గుండె పనితీరుని మెరుగుపరచటంలో వాక్కాయలు కీ రోల్ ప్లే చేస్తాయి.
రక్తహీనతతో బాధపడేవారికి వాక్కాయలు బాగా యూజ్ అవుతాయి. దీనిలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.
రక్తహీనతతో బాధపడే గర్భిణులు వాక్కాయాల్ని తీసుకుంటే ఐరన్ లోపం తగ్గిపోతుంది. రక్తంలో వ్యర్ధాలు బయటకెళ్లిపోతాయి.
జీర్ణాశయం పనితీరు మెరుగుపడాలంటే నాలుగు కాయల్ని ఉప్పుతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మలబద్ధకం తగ్గిపోతుంది.
షుగర్ ఉన్నవాళ్లకు వాక్కాయలు మేలు చేస్తాయి.
రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలు అదుపులో ఉంచటంలో హెల్ప్ అవుతాయి.
చిగుళ్ల నుంచి రక్తం కారటం, దంత సమస్యలున్నవాళ్లు వాక్కాయలు నమిలి తినటం వల్ల దంతాలు శుభ్రమవుతాయి. చిగుళ్ల నుంచి రక్తం, పొక్కులు రావటం తగ్గుతాయి.
నీరసం, అలసట, ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలతో సతమతమవుతున్న వాళ్లు వాక్కాయ జ్యూస్ తాగితే తక్షణ శక్తి లభిస్తుంది.
వాక్కాయలతో డీ హైడ్రేషన్ బారిన పడకుండా కూడా ఉంటాం. గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్యలు పరార్ అవుతాయి.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.