సోషల్ మీడియా పుణ్యమాని అని సామాన్యులు సైతం సెలబ్రిటీలు అయ్యారు. వారిలో ఒకరు షణ్ముఖ్ జస్వంత్

ఈ  వైజాగ్ కుర్రాడు చదువులు అయిపోయాక వైవా అనే  వెబ్ సిరీస్ లో నటించాడు.

 ఆ తర్వాత యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేసుకుని వీడియోలు, షార్ట్ ఫిల్మ్, పలు వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫేమస్ అయ్యాడు.  

అయితే అతడికి పేరు తెచ్చిందీ మాత్రం సాఫ్ట్ వేర్ డెవలవ్ పర్, సూర్య వెబ్ సిరీస్‌లే. 

దీంతో  అతడికి యూత్‌లో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. 

ఆ సమయంలోనే మరో యూట్యూబర్ దీప్తి సునయన ప్రేమల్లో్ పడ్డాడు. వీరిద్దరూ ఒకరి పేరును మరొకరు టాటూగా వేయించుకున్నారు

షన్ను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కూడా పట్టుబడ్డాడు.

అయినప్పటికీ అతడికి ఫేమ్ ఉండటంతో  అభిమానులు సైతం ఈ విషయాన్ని లైట్  తీసుకున్నాడు.

 ఆ సమయంలోనే బిగ్ బాస్  5లో అవకాశం వచ్చింది.  అయితే ఇది అతడి జీవితాన్ని తల్లకిందులు చేసింది

మరో యూట్యూబర్ సిరి హన్మంత్ తో చేసిన రొమాన్స్ .. దీప్తి, షన్ను స్నేహంలో చిచ్చు పెట్టింది.

బ్రేకప్ తర్వాత వీరిద్దరూ తమ తమ పనుల్లో బిజీ అయిపోయారు. ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటున్నారు.

అయితే షన్ను తాజాగా ఓ సాంగ్ చేయగా.. దానిపై దీప్తి సునయన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

అయ్యోయ్యో అంటూ సాగే సాంగ్‌లో నటించిన ఫణిపూజితతో షన్ను చేసిన రొమాన్స్ ఇప్పుడు  కాక రేపుతోంది. 

ఆ పాటలో ఓ సీన్‌లో ఆమెను కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకున్న వీడియోను షన్ను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసుకున్నాడు. ఇక ఫ్యాన్స్ వదలరు కదా..

దీప్తి బాధ పడుతుంది బ్రో, దీపూ మీద రివెంజ్ ఆ అని కొంత మంది కామెంట్లు పెడుతున్నారు

అరే ఏంట్రీ షన్ను ఇది అనీ, దీప్తి ఇలా చేస్తే నీకెలా ఉంటుందని మరికొంత మంది కామెంట్స్  చేశారు

ఎక్కడో  కాలిన వాసన వస్తుందని,   ఎందుకిలా చేస్తున్నావ్ షన్ను, నువ్వు ఎంత చేసినా మాకు దీపు-షన్నునే కావాలంటూ రాస్తున్నారు.