తెలుగు, తమిళ, కన్నడ సినీ రంగాలలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు నటుడు శరత్ బాబు

1951 జులై 31న ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాలవలసలో జన్మించారు. 

శరత్‌ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన పేరు శరత్‌బాబు గా మార్చుకున్నారు.  

మొదట శరత్ బాబు పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి వెళ్లాలని భావించారు. కానీ ఆయన కళ్లు సమస్య కారణంగా వెళ్లలేకపోయారు. 

కాలేజీలో శరత్ బాబు స్నేహితులు నువు అచ్చం హీరోలా ఉన్నాం.. ఇండస్ట్రీలో ట్రై చేయాలని  స్నేహితులు ప్రోత్సహించడంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

1973 ‘రామరాజ్యం’ మూవీతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. 

సీతాకోక చిలుక(1981) , ఓ భార్య కథ(1988), నీరాజనం (1989) మూడు చిత్రాల్లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అవార్డు కైవసం చేసుకున్నారు.

ఇప్పటి వరకు ఆయన పలు భాషల్లో సుమారు 220 కి పైగా చిత్రాల్లో నటించారు.  

 శరత్‌బాబు రామరాజ్యం చిత్రం తర్వాత వచ్చిన కన్నెవయసు మూవీతో మంచి పేరు సంపాదించారు. 

కెరీర్ బిగినింగ్ నెగిటీవ్ పాత్రల్లో నటించిన ఆయన తర్వాత హీరోగా నటించారు. ఆ తర్వాత విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు. 

ప్రముఖ దర్శకులు బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘చిలకమ్మ చెప్పింది’ మూవీ శరత్‌బాబు  కి మంచి పేరు తీసుకు వచ్చింది.  

మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించారు శరత్ బాబు. 

తెలుగు సినిమా చరిత్రలో విలక్షణమైన నటుడిగా గుర్తింపు పొందిన శరత్ బాబు మే 22, సోమవారం.. హైదరాబాద్ ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.