ప్రస్తుతం చాలా మంది భోజనంపై అసలు శ్రద్ధ చూపించట్లేదు. ఆలస్యంగా తింటున్నారు. వెంటనే నిద్రపోతున్నారు.

కేవలం రాత్రి మాత్రమే కాదు.. పగలు భోజనం చేసిన తర్వాత కాసేపు అయినా నిద్రపోతుంటారు.

ఇలా భోజనం తిన్న వెంటనే నిద్రపోవడం చాలా డేంజర్ అని వైద్యనిపుణులు చెబుతున్నారు. కొన్ని సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఆహారం తిన్న తర్వాత శరీరంలో షుగర్, గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి. తిన్న వెంటనే నిద్రపోతే.. మీ బాడీలో షుగర్ కరిగిపోతుంది.

ఒకవేళ తిన్నవెంటనే నిద్రపోవాలనుకుంటే మాత్రం షుగర్ లేని ఆహారం తీసుకోండి. అలా కాదనుకుంటే మాత్రం డయాబెటిస్ వచ్చే ఛాన్సు చాలా ఎక్కువ!

ఆహారం తిన్న వెంటనే మీకు నిద్రరావొచ్చేమో కానీ అర్థరాత్రి ఆ నిద్ర చెదిరిపోతుంది. ఈ ప్రక్రియ రోజూ జరిగితే మీకు నిద్రాభంగం గ్యారంటీ.

ఎందుకంటే పొట్టలో ఆహారం పేరుకుపోయి జీర్ణక్రియ మందగిస్తుంది. జీవక్రియ కూడా బలహీనంగా మారుతుంది.

తిన్న వెంటనే నిద్రపోతే.. అసిడిటీ, చికాకు లాంటి సమస్యలు వస్తాయి. ప్రేగులు ఆహారాన్ని జీర్ణం చేయడానికి యాసిడ్ ని తయారుచేస్తాయి.

ఒకవేళ తిన్న వెంటనే నిద్రపోతే ఈ యాసిడ్.. కడుపుని విడిచిపెట్టి.. అలిమెంటరీ కెనాల్, ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. తద్వారా చికాకు కలుగుతుంది.

తిన్న వెంటనే నిద్రపోతే.. శరీరంలోని చాలా భాగాలు కదలకుండా ఉంటాయి. దీని వల్ల తిన్నది జీర్ణం కావడానికి అంతరాయ కలుగుతుంది.

అందుకే తిన్న వెంటనే నిద్రపోయిన వారికి.. నిద్రలేచేసరికి కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది.

రాత్రిపూట ఏది తిన్నాసరే తక్కువగానే తీసుకోవాలి. కడుపు నిండుగా అస్సలు తినకూడదు. వీలైనంత వరకు తక్కువే తినడానికి ట్రై చేయండి.

ఒకవేళ అలా కాదని రాత్రి ఎక్కువ తింటే.. అది మీ నడుముపై ప్రభావం చూపిస్తుంది. మీరు బరువు పెరగడానికి కారణమవుతుంది.

పైన చెప్పిన ఏ సమస్యలు కూడా రాకూడదని మీరు అనుకుంటే మాత్రం.. తిండి, నిద్రకు మధ్య మూడు గంటల గ్యాప్ వచ్చేలా చూసుకోండి.

నిద్ర, రాత్రి భోజనానికి మధ్య కనీసం రెండు గంటలైనా సరే గ్యాప్ మెంటైన్ చేయడం మంచిది.

అంటే రాత్రి 10కి నిద్రపోవాలి అనుకుంటే.. రాత్రి 7:30 లేదా 8 కల్లా భోజనం చేసేయడం మంచిది.

నోట్: పైన చెప్పిన చిట్కాలు పాటించేముందు ఓసారి డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.