బెండకాయను 12 శతాబ్దంలో ఆఫ్రికాలోని ఇతియోపియాలో మొట్టమెదటి సారి పండించారు.

బెండకాయలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఎమెరాల్డ్‌, క్లెంసన్‌, ఎనీ ఓక్లే, పర్పుల్‌, చైనీస్‌ అన్న రకాలు అందుబాటులో ఉన్నాయి.

బెండకాయ, పత్తి ఒకే జాతికి చెందిన మొక్కలు కావటం విశేషం. ఇవి మాలో కుటుంబానికి చెందినవి.

బెండకాయ వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉన్నాయి.

టర్కీతోపాటు తూర్పు మధ్యధరా ప్రాంత నివాసులు రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించేందుకు దీన్ని తింటారు.

బెండకాయ తొక్క, గింజలను బ్లడ్ షుగర్స్‌ను కంట్రోల్ కోసం ఉపయోగిస్తారు.

బెండకాయలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. 

ఇది పేగు క్యాన్సర్‌నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది.

ఇందులో ఉండే ప్రోబయోటిక్స్‌, కడుపును ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణక్రియ కూడా సాఫీగా సాగుతుంది.

తరచుగా బెండకాయను ఆహారంలో తీసుకోవటం ద్వారా ఓబేసిటీని కంట్రోల్‌ చేయోచ్చు.

బెండకాయలో ఉండే విటమిన్‌ సీ, ఫైబర్‌ చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతాయి.

బెండకాయల్ని తినటం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది.

గమనిక: ఈ టిప్స్ ఫాలో అయ్యే ముందు నిపుణులను, వైద్యులను సంప్రదించవలసిందిగా మనవి.