ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ తెరకెక్కించిన F2  మూవీ 2019లో సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన  సంగతి తెలిసిందే. ఆ హిట్టును కంటిన్యూ చేస్తూ  నిర్మాత దిల్ రాజు – డైరెక్టర్ అనిల్ రావిపూడి F3                      మూవీని రూపొందించారు.

కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా  మొత్తానికి మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 

                 చాలా గ్యాప్ తర్వాత వెంకటేష్ బిగ్ స్క్రీన్ పై                కనిపించడం, గని ప్లాప్ తర్వాత వెంటనే వరుణ్                   నుండి ఈ సినిమా రావడం.. ఇద్దరికి సమ్మర్      సోగ్గాళ్ళుగా కంబ్యాక్ హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు. 

అదిగాక హీరోయిన్స్ తమన్నా, మెహరీన్ గ్లామర్ కి  తోడు సోనాల్ చౌహన్ స్పెషల్ క్యారెక్టర్, పూజా హెగ్డే  స్పెషల్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేసాయి.  F3 మూవీ సక్సెస్ జర్నీ కంటిన్యూ చేసిందా లేదా                                 రివ్యూలో చూద్దాం! 

కథ:

   ఈ సినిమాలో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తో పాటు  డబ్బును పెద్ద సమస్య. డబ్బుకోసం పరితపిస్తూ  ఫ్యామిలీ కష్టాలను మోస్తున్న వెంకీ(వెంకటేష్)కి                          ఇంటినిండా అప్పులే.

ఆల్రెడీ మంగ హోటల్ నడిపే హారిక(తమన్నా)  ఫ్యామిలీ చేతిలో మోసపోయి ఎలాగైనా డబ్బు  వసూల్ చేయాలనీ చూస్తుంటాడు. ఈ క్రమంలో    అనాధ అయిన వరుణ్ యాదవ్(వరుణ్ తేజ్). 

  రిచ్ అని చెప్పుకుంటూ తిరిగే హనీ(మెహరీన్)ని  చూసి ఇష్టపడతాడు. ఆమెను ఇంప్రెస్స్ చేసుకునే  క్రమంలో వెంకీ సాయంతో పాలబేబీ(అలీ) దగ్గర  లక్షల్లో అప్పు చేస్తాడు. తీరా పెళ్లి టైంలో ఆమె రిచ్  కాదని తెలుస్తుంది. మోసపోయి అప్పు వసూల్                            చేద్దామని ట్రై చేయగా.. 

ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ తెరకెక్కించిన F2  మూవీ 2019లో సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన  సంగతి తెలిసిందే. ఆ హిట్టును కంటిన్యూ చేస్తూ  నిర్మాత దిల్ రాజు – డైరెక్టర్ అనిల్ రావిపూడి F3                      మూవీని రూపొందించారు.

ఓ షాకింగ్ ట్విస్టు తెలుస్తుంది. అలాగే దొంగతనం   చేసిన డబ్బు పోగొట్టుకొని చావు వరకు వెళ్లి.. చివరి     క్షణంలో ఓ గుడ్ న్యూస్ తెలిసి విజయనగరం    వెళ్తారు. మరి వెంకీ – వరుణ్ – హారిక – హనీ ఏం      చేశారు? అప్పుల నుండి ఎలా బయటపడ్డారు?

     వారి లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి  ఎలాంటి సందేశం ఇచ్చారు? అనేది తెరపైనే చూడాలి.  

డబ్బు చుట్టూ జనాల ఎలా పరిగెడతారో చూపిస్తూ ఫస్ట్  హాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ సమయానికి మెయిన్  క్యారెక్టర్స్ అన్నీ ఓ పెద్ద ట్విస్టుతో చావడానికి సిద్ధం  అవుతాయి. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రలు పరిచయాలు..              డబ్బుకోసం ఆ పాత్రలు పడే వెంపర్లాట. 

ముఖ్యంగా ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకి హైలైట్ గా  నిలుస్తాయి. అన్నీ ఫన్ లో భాగమే కావడం సినిమాలో                                            విశేషం. 

అనిల్ రావిపూడి మరోసారి తన కామెడీ పవర్ ని బాగా  యూస్ చేసుకున్నాడు. వెంకటేష్ కి రేచీకటి, వరుణ్ కి  నత్తి డిఫెక్ట్స్ గా పెట్టి యాక్టింగ్ తో పాటు మంచి కామెడీ                                   రాబట్టగలిగాడు. 

      ఈ సినిమాలో వెంకీ, వరుణ్, తమన్నా చెలరేగి       పోయారనే చెప్పాలి. అయితే.. కామెడీ అన్నాక       లాజిక్స్ లేని సీన్స్ కనిపిస్తాయి. కానీ నవ్విస్తూ  ఆ లాజిక్స్ ని మరిపించే ప్రయత్నం చేశాడు అనిల్. 

చివరిలో F2, F3లను కంటిన్యూ చేస్తూ F4 ఉంటుందని    చెప్పేసాడు దర్శకుడు. ఇలా కామెడీని ప్రధానంగా       చేసుకోని అయితే F4 వస్తే మంచిదే అనే ఫీలింగ్                    ఆడియన్స్ లో కలుగుతుంది.