సాధారణంగా మార్కెట్ లో లభించే పండ్లు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి.. అందులో అనాసపండు (పైనాపిల్) ఒకటి.

ఈ పండులో రుచి, సువాసనతో పాటు 85 శాతం నీరు కూడా ఉంటుంది. 

ఇందులో చక్కెర 13 శాతమే ఉంటుంది.. పీచు పదార్థం 0.35 ఉంటుంది. 

అనాస పండులో విటమిన్ ఏ,బి, సి పుష్కలంగా ఉంటాయి.

అనాస పండు తింటే పచ్చకామెర్ల నుంచి ఉపశమనం పొందవొచట

మూత్ర పిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగించే గుణాలు పనాసలో ఉన్నాయి

నడుపు నొప్పి, ఇతర నొప్పులకు ఈ పండు తింటే ఉపశమనం లభిస్తుంది.

ఈ పండు ముక్కలను తేనెలో కలుపుకొని తింటే శారీరక శక్తి పుష్కలంగా వస్తుందట.

 గొంతు నొప్పి, పుండ్లతో బాధపడేవారు  అనాస పండు రసం తాగితే ఉపశమనం లభిస్తుందట.

ఈ పండులో ఉండే  ఆమ్లం..  ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుందట.

పైనాపిల్ ఆకుల రసం తాగితే కడుపులో ఎలాంటి నూలు పురుగులు చచ్చిపోతాయంటారు. 

అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా చూస్తుందంటారు. 

నీరసం, జ్వరం తో ఇబ్బంది పడేవారికి అనాస పండు జ్యూస్ తాపిస్తే శక్తి లభిస్తుందంటారు.