మన ఆరోగ్యానికి చిరు ధాన్యాలు ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావలసిన పోషకాలను ఇవి అందిస్తాయి.

మన ఆరోగ్యాన్ని కాపాడే చిరుధాన్యాల్లో సజ్జలు ఒకటి. 

సజ్జలు తింటే కలిగే లాభాలు ఏమిటో తెలిస్తే మీరు తీసుకోక మానరు. మరి.. ఆ లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

సజ్జల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా.. మన జీర్ణవ్యవస్థ చక్కగా ఉంటుంది. 

సజ్జలు తీసుకోవడం ద్వారా చర్మానికి సంబంధించిన సమస్యల తగ్గుతాయి. 

యవ్వనంలోనే ముఖం మీద ముడతలు వచ్చినట్లయితే.. సజ్జలు క్రమం తప్పకుండా తీసుకోవడంతో  వాటిని తొలగించుకోవచ్చు.

మిల్లెట్లో యాంటీ ఆక్సిడెంట్లు కాకుండా ఫినాలిక్లు కూడా ఉంటాయి. ఇవి చర్మానికి సంబంధించిన సమస్యల్లో యాంటీ-ఏజెంట్గా పనిచేస్తాయి.

శరీరంలో ఐరన్ లోపం ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఐరన్ పుష్కలంగా ఉన్న సజ్జలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో మిల్లెట్ ప్రభావవంతంగా ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులు మనల్ని చుట్టుముట్టవు. 

సజ్జలు తినడం వల్ల శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తుంది. దీంతో శరీర రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొంటున్నారు.

 వీటితో కాల్షియం, జనుము లభించడంతో పాటు మలబద్దకం కూడా దూరం అవుతుంది

సజ్జలు ఆహారంగా తీసుకోవడం వలన వయసుతో పాటు వచ్చే సమస్యలతో పాటు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండా చూసుకోవచ్చు

ప్రతి రోజూ ఈ మిల్లెట్ తీసుకోవడం వల్ల స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చు.

సజ్జలు క్యాన్సర్, టైప్ టు డయాబెటీస్, న్యూరోలాజికల్ వ్యాధులు దరిచేరకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొటెక్ట్ చేస్తాయి.

కాబట్టి ఇన్ని లాభాలున్న సజ్జలను మీ డైట్ లో చేర్చుకోవడం తప్పనిసరి.