గోధుమ గడ్డిని మనం ఇంట్లోనూ పెంచుకోవచ్చు. గోధుమలను మొలకెత్తించి ఆ తర్వాత వాటిని నాటితే కొద్దిరోజుల్లోనే గోధుమగడ్డి పెరుగుతుంది.
కొద్దిగా పెరిగి, లేతగా ఉండగానే ఆ గడ్డిని సేకరించి దాన్ని జ్యూస్‌లా చేసుకుని రోజూ తాగండి.
అయితే గోధుమగడ్డిని పెంచలేని వారికి గోధుమ గడ్డి జ్యూస్ లభిస్తుంది. ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ రెండింటిలో మీరు దేన్నైనా సరే ఉపయోగించొచ్చు. దీంతో మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
గోధుమగడ్డిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఐరన్, కాల్షియం, ఎంజైమ్స్, మెగ్నీషియం, ఫైటో న్యూట్రియెంట్లు
17 రకాల అమైనో యాసిడ్లు, విటమిన్‌లు ఎ, సి, ఇ, కె, బి కాంప్లెక్స్, క్లోరోఫిల్, ప్రోటీన్లు ఉంటాయి.
గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
గోధుమగడ్డిలో చాలా ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడతాయి. దీంతో అజీర్ణ సమస్య ఉండదు.
మనం తినే ఆహారంలోని పోషకాలను శరీరం సులభంగా గ్రహించగలుగుతుంది. గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు కూడా గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల తగ్గుతాయి.
గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.
గోధుమ గడ్డి జ్యూస్ రోజూ తాగితే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలు పెరుగుతాయి.
దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
గోధుమ గడ్డిలోని పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బీపీని తగ్గిస్తాయి. ఎర్ర రక్త కణాల సంఖ్య పెంచుతాయి.
దీంతో రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడొచ్చు.
గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
గర్భిణీలు, బాలింతలు గోధుమ గడ్డి జ్యూస్ తాగొద్దు. ఒకవేళ వికారం, తలనొప్పి, మలబద్దకం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ జ్యూస్‌ను తీసుకోవడం ఆపేయాలి.
కొందరికి ఈ జ్యూస్ పడదు. అందువల్ల ఈ లక్షణాలు కనిపించిన వెంటనే జ్యూస్‌ను తీసుకోవడం మానేయాల్సి ఉంటుంది.
గోధుమ గడ్డి జ్యూస్ రోజూ 30ml మోతాదులో తీసుకోవచ్చు. పొడి అయితే ఒక టీస్పూన్ పొడిని 250 ml నీటిలో కలిపి తీసుకుంటే మంచిది.
అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు గోధుమ గడ్డిని ఉపయోగించడం ఉత్తమం.
నోట్: పైన టిప్స్ ఫాలో అయ్యే ముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.