కన్నవాళ్లు ఎవరో తెలిదు.. నా అనే వాళ్లు లేరు.. ఆదరించి, అక్కున చేర్చుకునే వాళ్లు లేక.. అనాథలు అనుభవించే బాధ వర్ణించడానికి మాటలు చాలవు.

ఇలాంటి అనాథల పాలిట కల్పతరువుగా మారింది ఓ విద్యా సంస్థ.

కేవలం అనాథలు, పేదలకు మాత్రమే ఆ స్కూల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు.

అదే హీల్‌ ప్యారడైజ్‌ స్కూల్‌. అనాథల పాలిట కల్పతరువుగా మారింది.

గుంటూరుకు చెందిన డాక్టర్‌ కోనేరు సత్య ప్రసాద్‌ అనే వ్యక్తి.. ఈ విద్యాసంస్థను 1993లో ఏర్పాటు చేశాడు.

ప్రస్తుతం ఇక్కడ 750 మంది అనాథ బాలబాలికలు ఆశ్రయం పొందడమే కాక చదువుకుంటున్నారు.

ఈ స్కూల్‌ ఇది ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం, తోటపల్లి గ్రామంలో ఉంది.

30 ఏకరాల సువిశాల ప్రాంగణంలో హీల్‌ ప్యారడైజ్‌ స్కూల్‌ను ఏర్పాటు చేశారు.

దీనిలో పేద, అనాథ చిన్నారులకు ఉచిత విద్యతో పాటు, ఫ్రీగా వసతి, భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.

ఇక ఈ పాఠశాలలో కార్పొరేట్‌ స్కూల్స్‌కు ధీటుగా.. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌లో.. ఇంగ్లీష్‌ మీడియంలో బోధిస్తారు.

ఈ స్కూల్‌లో బాలబాలికలకు వేర్వేరుగా అన్ని అధునాతన వసుతులు కలిగిన హాస్టల్స్‌ ఉన్నాయి.

ఇక విద్యార్థులకు పెట్టే భోజనంలో సేంద్రియ పద్దతిలో పండించిన కూరగాయలను ఆహారంలో వినియోగిస్తారు.

అలానే విద్యార్థులు తాగేందుకు ఆర్‌ఓ ప్యూరిఫైడ్‌ నీటిని అందిస్తారు.

ఇక పాఠశాలలో 15 వేల పుస్తకాలతో అతి పెద్ద లైబ్రరీ ఏర్పాటు చేశారు.

అలానే త్రీడీ పెయింటింగ్‌, కళలు, సంగీతం, డ్యాన్స్‌ వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.

ఆటల విషయంలోనూ ఈ స్కూల్‌ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది.

దీని కోసం ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన 400 మీటర్ల ట్రాక్‌, బాస్కెట్‌ బాల్‌, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌ కోర్టులున్నాయి.

ఇక ఇంటర్‌ పూర్తై.. పై చదువులు చదవాలనుకునేవారికి.. అనగా వారు డిగ్రీ, పీజీ పూర్తి చేయడానికి మద్దతుగా నిలుస్తోంద హీల్‌ ప్యారడైజ్‌.

ఇక 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 1-5వ తరగతి వరకు ప్రవేశాలను కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇక్కడ స్మార్ట్‌ క్లాస్‌ రూముల్లో తరగతులు నిర్వహిస్తారు.

ఏప్రిల్‌ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 7-10 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

మిగతా సమాచారం కోసం ఈ నంబర్లకు 9100024438, 9100024437 కాల్‌ చేయండి.