ఇప్పటి వరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అయిన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి వాటి ద్వారా డబ్బులు వస్తాయి.
ఇక మీదట ట్విట్టర్‌లో కూడా డబ్బులు సంపాదించవచ్చు అంటున్నాడు సీఈవో ఎలాన్ మస్క్.
ఎలాన్ మస్క్ ట్విట్టర్ సీఈవో అయిన తర్వాత షాకులు ఇవ్వడం తప్ప ఎప్పుడు శుభ వార్త చెప్పలేదు.
పైగా ఆయన ట్విట్టర్ సీఈఓ అయ్యాక చాలా మార్పులు వచ్చాయి.
ఎందరో ఉద్యోగాలు కోల్పోయారు.. బ్లూ టిక్‌కు డబ్బులు, లోగో మార్చాడం వంటి చర్యలకు పాల్పడ్డాడు.
ఇక తాజాగా రెండు రోజుల క్రితం సెలబ్రిటీల ట్విట్టర్ అకౌంట్స్‌కి బ్లూ టిక్ తీసేసి వారికిషాకిచ్చాడు.
మస్క్ ట్విట్టర్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఎప్పుడు ఏం బాంబు పేలుస్తాడో అన్నట్టుగా అతడి నిర్ణయాలు ఉన్నాయి.
కానీ తాజాగా ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పాడు మస్క్.
మరి ఆ శుభవార్త ఏంటంటే.. ఇక ట్విట్టర్ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు.
ఇందుకు సంబంధించి మానిటైజేషన్ ప్లాన్‌ను ప్రకటించాడు మస్క్.
ఎక్కువ సమాచారం నుంచి.. ఎక్కువ నిడివి ఉన్న వీడియోల వరకు.. దేనికైనా సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌తో డబ్బు సంపాదించవచ్చని తెలిపాడు.
ఇందుకోసం యూజర్లు.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. మానిటైజ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
ఈ ఆప్షన్ ఇప్పటికే అమెరికాలో అందుబాటులో ఉండగా.. త్వరలోనే ఇది మరిన్ని దేశాల్లో అందుబాటులోకి రానుందని తెలిపాడు ఎలాన్ మస్క్.
అయితే, ఈ ప్రయోజనాలు పొందాలంటే మాత్రం యూజర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందాల్సి ఉంటుంది.
ట్విట్టర్‌లో షేర్ చేసే లాంగ్‌ఫామ్ కంటెంట్, ఇమేజ్‌లు, వీడియోలకు మాత్రమే ఈ సబ్‌స్క్రిప్షన్ పాలసీ పనిచేస్తుందని ప్రకటించాడు.