ఎలక్ర్టిక్ వాహనాలకు భారత్ లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

ఈవీల్లో కూడా మరీ ముఖ్యంగా స్కూటీలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడతున్నారు.

అయితే ఎలక్ట్రిక్ స్కూటీలు కూడా కాస్త ఖరీదుగానే ఉంటున్నాయి.

అందుకే ఇప్పుడు మీకోసం ఒక బడ్జెట్ ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకొచ్చాం.

ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ని రాజస్థాన్ ఉదయపూర్ లోని రాణా ప్రతాప్ అగ్రికల్చర్ అండే సైన్స్ యూనివర్సిటీ వాళ్లు రూపొందించారు.

యూనివర్సిటీలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ ఈ- సైకిల్ రూపొందించింది.

ఈ సైకిల్ 45 కిలోమీటర్ల రేంజ్ తో వస్తోంది.

దీనిని కేవలం 30 నిమిషాల్లోనే ఛార్జ్ చేయచ్చు.

ఈ సైకిల్ లో ఎలక్ట్రిక్ గేర్లతో పాటుగా పెడలింగ్ సిస్టమ్ కూడా ఉంది.

దీనికి హార్న్, ఫ్లాష్ లైట్, డిస్క్ బ్రేకులు కూడా ఉండటం విశేషం.

ఈ సైకిల్ గరిష్టంగా 160 కిలోల వరకు బరువును మోయగలదు.

 దీని ధర రూ.30 నుంచి రూ.35 వేల వరకు ఉంటుందని తెలిపారు.

ఉదయ్ పూర్ యూనివర్సిటీ వాళ్లు తయారు చేసిన ఈ-సైకిల్ కొనుగోలు చేసేందుకు కాలేజ్ ని సంప్రదించాలని కోరారు.

మీ పాత సైకిల్ ని కూడా మీరు ఈ-సైకిల్ తరహాలో తయారు చేసుకోవచ్చు.

అందుకోసం కేవలం రూ.18 వేలు మాత్రమే ఖర్చవుతుందని డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్‌ విక్రమాదిత్య వెల్లడించారు.