మారిన ఆధునిక కాలంలో చాలా మంది బ్రెడ్ తో చేసిన బ్రేక్ ఫాస్ట్ లనే ఉదయం తినడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు.
అయితే ఉదయం పరగడుపున వైట్ బ్రెడ్ తినడం అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
పరగడుపునే వైట్ బ్రెడ్ తినడం వల్ల అనారోగ్యం సంభవిస్తుందని వైద్యులు అంటున్నారు.
ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయాన్నే టిఫిన్ కు బదులుగా వైట్ బ్రెడ్ తీసుకుంటే త్వరగా ఆకలి వేస్తుంది.
దాంతో శరీరానికి కావాల్సిన దాని కన్నా ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటాం.
ఫలితంగా శరీరం అధిక బరువుకు దారి తీస్తుంది. దాంతో డయాబెటిస్, గుండె జబ్బులకు ఇది దారి తీస్తుంది.
ఇక వైట్ బ్రెడ్ లో గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. దీన్ని తినడంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుతాయి.
ఇలాగే కొనసాగిస్తే టైప్ 2 డయాబెటిస్ కు దారి తీస్తుంది.
వైట్ బ్రెడ్ లో ఉండే సులభతరమైన కార్బోహైడ్రేట్లు.. జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపి.. మలబద్దకం, అజీర్ణం, గ్యాస్ సమస్యలు వస్తాయి.
సోడియం మన శరీరానికి అంత మంచిది కాదు. వైట్ బ్రెడ్ లో అధికంగా సోడియం ఉంటుంది. తరచుగా బ్రెడ్ ని తింటే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
కాబట్టి వీలైనంత త్వరగా వైట్ బ్రెడ్ ను ఎక్కువ తినే అలవాటును మార్చుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.