హడావిడిగా ఆఫీసులకు వెళ్లేవాళ్లు, జిమ్‌కు వెళ్లేవాళ్లు ఎక్కువగా బ్రేక్ ఫాస్ట్‌గా పీనట్ బటర్ విత్ బ్రెడ్ తింటుంటారు.
మరి కొంతమంది కండపుష్టి వస్తుంది కదా అని వీలైనప్పడల్లా పీనట్ బటర్‌ను తింటుంటారు.
ఇంకా కొంతమంది టేస్ట్ బాగుంది కదా అని లాగిస్తుంటారు.
అలా ఇష్టం వచ్చినట్లు పీనట్ బటర్‌ను తినటం మంచిది కాదు.
అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు ఎక్కువగా తీసుకోవటం కూడా ప్రమాదమే.
పీనట్ బటర్ మితంగా తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో.. అతిగా తింటే అన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
రోజుకు అరస్పూను కంటే ఎక్కువగా తినటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
పీనట్ బటర్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. రోజూ తినడం వల్ల బరువు పెరుగుతారు.
పీనట్ బటర్‌లో ఉండే ఒమెగా 6 అవసరానికంటే ఎక్కువగా శరీరంలోకి చేరటం ప్రమాదకరం.
పీనట్ బటర్ ఒలేయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అలాగే మంచి కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిని తగ్గించడంలో తోడ్పడుతుంది.
ఈ రెండూ అదుపులో ఉంటేనే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే ప్రమాదమే..
పీనట్ బటర్‌లో అధిక శాతంలో కొవ్వులుంటాయి. వీటి వల్ల పొట్టలో యాసిడ్ ఉత్పత్తి ఎక్కువవుతుంది.
తద్వారా గుండెల్లో మంట పుడుతుంది. అంతేకాదు! కొవ్వులు అన్నవాహికలో అసౌకర్యాన్ని కూడా కలుగు జేస్తాయి.