మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది బయట ఏది పడితే అది తింటున్నారు.
మరీ ముఖ్యంగా నగరాల్లో ఉంటున్న యువతి, యువకులు ఎక్కువగా పిజ్జాలు, బర్గర్ లు వంటివి లాగింజేస్తున్నారు.
దీంతో పాటు నోటికి రుచిగా ఉండడంతో ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ రైస్, పునుగులు వంటివి తినేస్తున్నారు.
అయితే ఇలాంటివి తినడం వల్ల లేని పోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫ్రైడ్ రైస్, నూడిల్స్, పునుగులు అతిగా తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి?
అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
పైన పేర్కొన్న ఆహార పదార్థాలు తినడం ద్వారా శరీరంలో అధిక కొవ్వు నిల్వలు ఉండిపోయి రక్తనాళాల మీద ప్రభావం చూపుతాయి.
తద్వారా రక్త సరఫరా ఆగిపోయి గుండెకు రక్తం పంపింగ్ జరగడం కష్టమవుతుంది. ఇంతే కాకుండా గుండె పని తీరులో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.
దీంతో పాటు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా అధిక బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
ఇదే కాకుండా గుండెపోటు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.