కాలీఫ్లవర్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

కాలీఫ్లవర్ తినడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. దీని వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు.

బరువు తగ్గాలనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

కానీ బరువు పెరగాలనుకునే వారికి మాత్రం ఉపయోగం ఉండదు.

కాలీఫ్లవర్ లో విటమిన్ కే ఎక్కువ ఉంటుంది. 

ఇది బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్ పై ప్రభావం చూపిస్తుంది.

కాలీఫ్లవర్ లో ఉండే విటమిన్ సి వల్ల బ్లడ్ కాట్ అయ్యే అవకాశం ఉంది.

కాలీఫ్లవర్ ను అధికంగా తినడం వల్ల గ్యాస్ సమస్యలు కూడా వస్తాయి.

కడుపు ఉబ్బరంగా ఉంటుంది. 

కాలీఫ్లవర్ లో గ్లూకోసినోలేట్స్ అనబడే సల్ఫర్ రసాయనాల సమ్మేళనం ఉంటుంది.

ఇవి కడుపులో బ్రేక్ అయినప్పుడు అవి హైడ్రోజన్ సల్ఫైడ్ ని సృష్టిస్తాయి. 

దీని వల్ల కడుపులో అలజడి మొదలై అపానవాయువులు వస్తాయి.

మిగతా కాలీఫ్లవర్స్ తో పోలిస్తే తాజాగా ఉండే కాలీఫ్లవర్ లో 30 శాతం అధికంగా ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. 

నీటిలో ఉడికించడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పోతాయి.

కాబట్టి కాలీఫ్లవర్ ను తక్కువ తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.